త్వరపడండి.. 'టయోటా హైలక్స్ పికప్' బుకింగ్స్ మళ్ళీ ప్రారంభమయ్యాయ్

గత సంవత్సరం భారతీయ మార్కెట్లో విడుదలైన టయోటా కంపెనీ యొక్క హైలక్స్ పికప్ ట్రక్కు కోసం, అతి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ వచ్చాయి. అయితే బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే కంపెనీ తాత్కాలికంగా బుకింగ్స్ నిలిపివేసింది. అయితే ఈ పికప్ ట్రక్కు కోసం బుకింగ్స్ మళ్ళీ మొదలయ్యాయి.

జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా తన హైలక్స్ పికప్ ట్రక్కుని మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. అవి హైలక్స్ మ్యాన్యువల్ స్టాండర్డ్, హైలక్స్ మ్యాన్యువల్ హై మరియు హైలక్స్ ఆటోమేటిక్ హై వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 33.99 లక్షలు, రూ. 35.80 లక్షలు, రూ. 36.80 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ మూడు వేరియంట్లు కూడా స్టాండర్డ్ 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో లభిస్తాయి.

టయోటా హైలక్స్ పికప్ బుకింగ్స్ మళ్ళీ ప్రారంభమయ్యాయ్..

టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ అనేది ఐఎమ్‌వి-2 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది భారతదేశంలోనే స్థానికంగా అసెంబుల్ చేయబడుతుంది. ఈ పికప్ ట్రక్కు డబుల్ క్యాబిన్ 5-సీటర్ వెహికల్. ఈ పికప్ ట్రక్కు ట్రెడిషనల్ ఎస్‌యూవీగా మరియు ప్రీమియం లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్కుగా కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి పికప్ ట్రక్కులు భారతీయ మార్కెట్లో అంత ప్రజాదరణ పొందలేదు. కానీ అమెరికా వంటి అగ్ర రాజ్యాల్లో ఈ వాహనాలకు డిమాండ్ బాగా ఎక్కువ.

టయోటా హైలక్స్ పరిమాణం పరంగా చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ పికప్ ట్రక్కు యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది. కావున ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

టొయటా హైలక్స్ పికప్ ట్రక్కు యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో పెద్ద హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్ మరియు ఇరు వైపులా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంటుంది. మజిక్యులర్ బాడీ లైన్స్‌తో ముందు వైపు నుండి ఇది గంభీరంగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌, వెనుక వైపు ఇది నిలువుగా ఉండే టెయిల్ లైట్స్ మరియు క్రోమ్ గార్నిష్‌తో కూడిన బంపర్ ఉంటాయి.

టయోటా హైలక్స్ పికప్ ట్రక్కు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్‌తో కూడిన ఇంటీరియర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ మొదలైన వాటిని అందిస్తోంది. అంతే కాకుండా ఇందులో జెబిఎల్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, ప్రంట్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

ఈ కారులో శక్తివంతమైన 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 3,400 ఆర్‌పిఎమ్ వద్ద 201 బిహెచ్‌పి పవర్ మరియు 1,400 ఆర్‌పిఎమ్ వద్ద 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ పికప్ ట్రక్కు యొక్క వాటర్ వాడింగ్ కెపాసిటీ 700 మిమీ వరకు ఉంటుంది.

టొయోటా హైలక్స్ పికప్ ఎమోషనల్ రెడ్, గ్రే మెటాలిక్, వైట్ పెర్ల్ సిఎస్, సిల్వర్ మెటాలిక్ మరియు సూపర్ వైట్ వంటి ఐదు రంగులలో లభిస్తుంది. ఇందులో కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఆప్సన్ ఎంచుకోవచ్చు. అయితే కంపెనీ ఇప్పుడు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది, అయితే డెలివరీల గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందివ్వలేదు, అయినప్పటీ డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota hilux pickup bookings reopen price variants details
Story first published: Monday, January 9, 2023, 14:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X