ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో CNG వాహనాలు విరివిగా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే టయోటా కంపెనీ ఇప్పటికే తన కార్లను CNG విభాగంలో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ విభాగంలోకి మరో కారుని జోడించింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త CNG వెర్షన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
టయోటా కంపెనీ భారతీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త CNG మోడల్ హైరైడర్ CNG. గత కొన్ని రోజులుగా కంపెనీ ఈ CNG వెర్షన్ గురించి సమాచారం అందిస్తూనే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ రోజు తన హైరైడర్ CNG వెర్షన్ ని లాంచ్ చేసేసింది. ఈ కొత్త టయోటా హైరైడర్ CNG ప్రారంభ ధర రూ. 13.23 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).

టయోటా హైరైడర్ CNG రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి S మరియు M వేరియంట్స్. ఈ వేరియంట్స్ ధరలు వరుసగా రూ. 13.23 లక్షలు మరియు రూ. 15.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ధరలు దాని మునుపటి మోడల్ అయిన పెట్రోల్ వేరియంట్స్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ. అయితే CNG వెర్షన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న పెట్రోల్ వేరియంట్స్ కంటే ఉత్తమ పనితీరుని అందిస్తాయి.
టయోటా కంపెనీ యొక్క హైరైడర్ CNG కోసం కంపెనీ ఇప్పటికి బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున రూ. 25,000 చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా అధీకృత డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. నిజానికి టయోటా హైరైడర్ పెట్రోల్ మోడల్ నాలుగు వేరియంట్స్ (E, S, G మరియు V) లో లభిస్తుంది. అయితే CNG వెర్షన్ కేవలం రెండు ట్రిమ్స్ (S మరియు G) లో మాత్రమే లభిస్తుంది.
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టయోటా హైరిడర్ CNG డిజైన్ దాని మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. అయితే లోపలి వైపు స్విచ్ గేర్ మరియు స్టీరింగ్ వీల్‌తో ఆల్ బ్లాక్ ఇంటీరియర్ పొందుతుంది. అయితే పెట్రోల్ వెర్షన్ కంటే CNG వెర్షన్ యొక్క బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బూట్ స్పేస్ లో 60 లీటర్ల CNG ట్యాంక్ అమర్చబడి ఉంటుంది.
హైరైడర్ CNG ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
హైరైడర్ CNG కంపెనీ యొక్క ఎర్టిగా మరియు XL6 CNG మోడల్స్ మాదిరిగానే అదే 1.5 లీటర్, ఫోర్ సిలిండర్, K12C ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది CNG మోడ్‌లో 88 హెచ్‌పి పవర్ మరియు 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ మోడ్‌లో ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. CNG వెర్షన్ 26.6 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.
కొత్త హైరైడర్ CNG ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, వెనుక ప్రయాణీకుల కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త CNG వెర్షన్ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








