ఇథనాల్‌తో నడిచే టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు ఆవిష్కరణ.. ప్రపంచంలోనే తొలిసారిగా..!
కాలుష్య రహిత భారతావనిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆగస్టు 29న కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రత్యా్మ్నాయ ఇంధనం ఇథనాల్‌తో నడిచే టయోటా ఇన్నోవా హైక్రాస్ MPVను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వాహనాన్ని విడుదల చేశారు. ప్రత్యామ్నాయ ఇంధనం అయిన ఇథనాల్‌ను సపోర్టు చేసే ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో కూడిన ఇన్నోవా హైక్రాస్‌ను మంత్రి లాంచ్ చేశారు. ఈ వాహనం BS6 స్టేజ్ 2 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎంపీవీ స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడుస్తుంది. ఈ వాహనం లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ కొత్త వాహనం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది. ఎంత ధరకు లభిస్తుందనే సమాచారం వెల్లడి కాలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వాహనం, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ వేరియంట్ పూర్తి భిన్నంగా ఉంటాయి.
ఇథనాల్ వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు. ఇది పెట్రోల్, డీజిల్ కంటే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతుంది మరియు ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు తక్కువ ఖర్చు అవుతుంది. ఫలితంగా ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఇథనాల్‌తో వాహనాలు నడపాలని భారత్ సహా ప్రపంచం కోరుకుంటోంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వాహనం 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 184.8bhp శక్తి, 206Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. e-CVT గేర్‌బాక్స్ ఎంపికతో అందుబాటులో ఉంది. ఈ కారు 23.24kmpl మైలేజీని ఇస్తుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ MPV విడుదల సందర్భంగా నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యామ్నాయ ఇంధనాన్ని వినియోగించడం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గుతాయని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. దేశంలో సుమారు 40 శాతం కాలుష్యానికి కేవలం వాహన ఉద్గారాలే కారణం అని తెలిపారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ప్రత్యామ్మాయ, జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోందని మంత్రి చెప్పారు. గత సంవత్సరం ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ను ప్రవేశపెట్టింది. 2025 సంవత్సరం నాటికి దేశంలో సుమారుగా అన్ని వాహనాల్లో 20 శాతం ఇథనాల్ ఇంధనాన్ని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం కొన్ని ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ఇథనాల్‌తో పనిచేసే ఇంజిన్‌లతో బైక్‌లు, స్కూటర్‌లను విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వ సాయంతో హైడ్రోజన్‌తో నడిచే మిరాయ్ EVను విడుదల చేసింది. ఈ వాహనం రూ.60 లక్షల ధరతో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం రోజు రోజుకు కాలుష్యం భారీగా పెరిగిపోతోంది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్, ఇథనాల్, సోలార్, హైడ్రోజన్ ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధనాలుగా ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








