Toyota land cruiser Mini కారు లాంచ్ ఎప్పుడు.. ఆ కార్లకు గట్టి పోటీ ఖాయమా?
టయోటా నుంచి సరికొత్త లైఫ్ స్టైల్ ఆఫ్ రోడ్ వెహికల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనం హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైయిన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ మినీ (Toyota Land Cruiser mini) వచ్చే సంవత్సరం ఆవిష్కరించే అవకాశం ఉంది. మారుతి సుజుకి జిమ్ని, మహీంద్రా థార్ వంటి వాహనాలకు పోటీగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అత్యంత ప్రజాధరణ పొందిన కార్లలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఒకటి. ఈ కారును సినీ, రాజకీయ నేతలు సహా చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త ఆఫ్ రోడ్ SUV అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. ఈ కారు కన్సెప్ట్ వెర్షన్ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. ప్రొడక్షన్ వెర్షన్ రానుందని తెలుస్తోంది. ఈ వాహనాన్ని లైట్ క్రూయిజర్ లేదా యూరిస్ క్రూయిజర్ అని కూడా పిలుస్తారు.

ఈ కారు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ అయినా.. ప్రొడక్షన్ వెర్షన్ పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్‌తోనూ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు ఫ్లాట్ రూఫ్‌ను కలిగి ఉంటుందని.. ఈ ల్యాండ్ క్రూయిజర్ మినీ కరోలా క్రాస్ సైజులోనే (Toyota off roader) ఉంటుంది. దీంతోపాటు టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్, వృత్తాకార LED హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయని తెలుస్తోంది.
అక్టోబర్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఈ కారును ప్రదర్శించే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, RAV4 2.5 లీటర్ పెట్రోల్/ హైబ్రిడ్ ఇంజిన్, 2.8 లీటర్ టర్బోచార్జ్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ మినీ కాన్సెప్ట్ మోడల్‌లో ముందు భాగంలో రెట్రో డిజైన్ ఉంది. మధ్యలో టయోటా బ్రాండ్‌తో కూడిన గ్రిల్ ఉంటుంది. దీంతోపాటు సిల్వర్ స్కిడ్ ప్లేట్ సహా ఆఫ్ వీల్ ఆర్చ్‌లతో కూడిన ముందు బంపర్ కూడా ఉంటుంది. అయితే ఈ కారు భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందా లేదా అనేది తెలియలేదు.
భారత్‌లో అందుబాటులో ఉన్న లైఫ్‌స్టైల్ ఆఫ్ రోడ్ SUV మారుతి జిమ్నీ, మహీంద్రా థార్ వంటి కార్ల విక్రయాలను పరిగణలోకి తీసుకొని టయోటా ఈ కారును భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటివరకు భారత్‌లో లాంచ్‌పై సంస్థ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : మారుతి సుజుకి నుంచి లైఫ్‌స్టైల్ ఆఫ్‌రోడ్ జిమ్మీని ప్రారంభించినప్పుడు భారీగా ఆదరణ దక్కింది. ఇటువంటి కార్లను భారత్‌లో చాలా మంది ఇష్టపడతారు. టయోటా నుంచి మినీ ల్యాండ్ క్రూయిజర్ కారు భారత్‌లో లాంచ్ అయితే ఇదే తరహా ఆదరణ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








