Toyota Rumion MPV విడుదల.. తక్కువ ధర, మెరుగైన ఫీచర్లు..!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా నుంచి కొత్త ఎంపీవీ కారు విడుదల అయింది. ఇప్పటికే సంస్థకు చెందిన ఇన్నోవా ఎంపీవీ ఇప్పటికే మంచి ఆదరణ పొందింది. ఈ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసేందుకు రూమియన్‌ను విడుదల చేసింది. టయోటా రూమియన్ MPV.. మారుతి సుజుకి ఎర్టిగా రీ-బ్యాడ్జ్ వెర్షన్‌గా లాంచ్ అయింది.
ఈ కారు డిజైన్ ఆకట్టుకుంటుంది. మరియు డిజైన్ అధునాతనంగా ఉంటుంది. ఇన్నోవా క్రిస్టా తరహాలో ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. దాని చుట్టూ క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. కొత్త గ్రిల్, LED టెయిల్‌లైట్‌తో వస్తుంది. టాయోటా రూమియన్ MPV ఆరు రంగుల్లో లభిస్తుంది.

భద్రత పరంగా రూమియన్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, టయోటా ఐ కనెక్ట్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ వంటి అనేక మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.
రూమియన్ MPV బంపర్ పైనున్న ఫాగ్ ల్యాంప్‌లు ఎర్టిగా కంటే భిన్నంగా ఉన్నాయి. కారు ఇంటీరియర్ 7 సీటర్ లే అవుట్‌ను కలిగి ఉంది. క్యాబిన్ లేత గోధుమరంగులో ఉంది. డ్యాష్‌బోర్డు మాత్రం కొంచెం విభిన్న రంగులో ఉంది. 7 అంగుళాల టచ్‌స్ర్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టయోటా రూమియన్ MPV కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ MPV 1.5 లీటర్ K- సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 6000 rpm వద్ద 101bhp శక్తి, 4400 rpm వద్ద 136.8Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
CNG వెర్షన్‌లోనూ అదే ఇంజిన్ ఉంటుంది. ఇది 5500rpm వద్ద 86.63bhp శక్తిని, 4200 rpm వద్ద 121.5Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టయోటా రూమియన్ ఎంపీవీ కారు పెట్రోల్ వేరియంట్ 20.51 kmph, CNG వేరియంట్ 26.11 kmph మైలేజీని అందిస్తుంది.

టయోటా రూమియన్ ప్రారంభ ధర రూ.10.29 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ రూ.13.68 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఈ కారు గేర్‌బాక్స్ ఎంపికను బట్టి వివిధ వేరియంట్లలో లభిస్తుంది. S -MT (పెట్రోల్), S- AT (పెట్రోల్), G- MT (పెట్రోల్), V- MT (పెట్రోల్), V- AT (పెట్రోల్), S- MT (CNG)లో అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం ఈ కారు ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. రూ.11,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయి.టయోటా రూమియన్ ఎంపీవీ సరసమైన ధరలో విడుదల చేసింది. భారీగా కస్టమర్లను ఆకర్షిస్తుందని సంస్థ భావిస్తోంది. పండుగ సీజన్‌లో ఈ కారుకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తోంది. మారుతి సుజుకి ఎర్టిగాను కొనుగోలు చేయాలని ఆలోచన ఉన్న కొంత మంది కస్టమర్లు టయోటా రూమియన్ వైపు మొగ్గు చూపవచ్చని భావిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








