భారత్ మార్కెట్‌లోకి టయోటా రూమియన్.. మారుతి సుజుకితో..!!
కరోనా అనంతరం భారత్‌లో MPV కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది ఎంపీవీ కార్ల కొనుగోలుకు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా కార్ల తయారీ సంస్థలు కూడా అటువంటి కార్లనే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. కియా, మారుతి సుజుకి, టయోటా వంటి సంస్థలు ఎంపీవీల పైన కూడా ఎక్కువ దృష్టిపెడుతున్నాయి.
ఇటీవలే మారుతి సుజుకి ఇన్విక్టో ఎంపీవీ కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు టయోటా హైక్రాస్ ఎంపీవీ రీ బ్యాడ్జ్ వెర్షన్‌గా వచ్చింది. చిన్నపాటి డిజైన్ మార్పులతో లాంచ్ అయింది. చాలా వరకు హైక్రాస్ ఫీచర్లను కలిగి ఉంది. మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

అయితే మారుతి సుజుకీ టయోటా భాగస్వామ్యంలో మరిన్ని కార్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. టయోటా నుంచి త్వరలో మరో ఎంపీవీ రానుందని తెలుస్తోంది. మారుతీ భాగస్వాగ్యంతో విడుదల కానుందని సమాచారం. ప్రస్తుతం భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో అంచనాలు క్రియేట్ చేస్తున్న కార్లలో టయోటా రూమియన్ MPV ఒకటి.
ఈ కారు మారుతి సుజుకి ఎర్టిగా రీ బ్యాడ్జ్ వెర్షన్‌గా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు దక్షిణాఫ్రికా మార్కెట్లో 2021 లోనే విడుదల అయింది. సాధారంగా కార్ల తయారీ సంస్ధలు వేర్వేరు దేశాల్లో వేర్వేరు పేర్లతో కార్లను విక్రయిస్తూ ఉంటాయి.

కానీ భారత్ మార్కెట్‌లోనూ రూమియన్ పేరుతోనే టయోటా ఈ కారును విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేరు కూడా సంబంధిత వర్గాల వద్ద నమోదు చేసినట్లు సమాచారం. రూమియన్ కారు ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది.
మారుతి సుజుకి ఎర్టిగా కారు తరహాలోనే టయోటా రూమియన్ ఇంజిన్ సహా పనితీరు కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని ప్రకారం రూమియన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మరియు 103 bhp శక్తి, 138 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రూమియన్ విడుదల కానుందని తెలుస్తోంది.

టయోటా రూమియన్ CNG వెర్షన్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వెర్షన్‌లో రూమియన్ 26-27 కి.మీ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా. అయితే మారుతి సుజుకీ కంటే రూమియన్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ మారుతి సుజుకి ఎర్టిగాలోని అనేక ఫీచర్లను రూమియన్ కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. టయోటా రూమియన్ కారుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజావార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








