బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?

ప్రస్తుత కాలంలో సినిమాలకు ఎంత క్రేజు ఉందొ సీరియల్స్ కి కూడా అంతకంటే ఎక్కువ క్రేజు ఉంది. సీరియల్స్ ద్వారా కూడా చాలామంది సెలబ్రిటీలుగా ఎదుగుతున్నారు. ఈ నేపధ్యానికి చెందిన వారిలో ఒకరు బుల్లితెర నటి 'శ్రీవాణి'. ఈమె ఇటీవల ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసింది.

బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు

కలవారి కోడలు, మనసు మమత, కాంచన గంగ మెరియు చంద్రముఖి మొదలైన హిట్‌ సీరియల్స్‌లో నటించి బాగా పాపులర్ అయిపోయింది. ఈ సీరియల్స్ లో కూడా ఎక్కువగా లేడీ విలన్ పాత్రలను పోషించి తనదైన రీతిలో ముందుకు వెళుతున్న శ్రీవాణి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. అయితే ఇటీవల శ్రీవాణి మారుతి సుజుకి కంపెనీ యొక్క గ్రాండ్ విటారా కారుని కొనుగోలు చేసింది.

బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు

శ్రీవాణి కొనుగోలు చేసిన ఈ కొత్త మారుతి గ్రాండ్ విటారా దేశీయ మార్కెట్లో అత్యంత ఆధరణ పొందిన మరియు పొందుతున్న కారు. ఈ గ్రాండ్ విటారా మల్టిపుల్ వేరియంట్స్ లో అందుబటులో ఉంటుంది. ఈ SUV ప్రారంభ ధర రూ.10.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే శ్రీవాణి కొనుగోలు చేసిన కారు రూ.13 లక్షల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. శ్రీవాణి తాను కొనుగోలు చేసిన కారుకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు

మారుతి గ్రాండ్ విటారా మంచి పనితీరుని అందిస్తుంది. ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. గ్రాండ్ విటారా ఒక లీటరుకి 28 కిమీ మైలేజ్ అందిస్తుంది. కావున ఇది వాహనం వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు

ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 హెచ్‌పి పవర్ మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది.

బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు

కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా అద్భుతమైన డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV ముందుభాగంలో క్రోమ్-లైన్డ్ హెక్సా గోనల్ గ్రిల్, త్రీ పాయింట్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సైడ్ బాడీ ప్యానెల్‌లు, టెయిల్‌గేట్ మరియు ఇంటిగ్రేటెడ్ టెయిల్-ల్యాంప్‌ వంటివి ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవి ఉంటాయి.

బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు

దేశీయ మార్కెట్లో మారుతి గ్రాండ్ విటారా 9 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆరు మోనోటోన్ కలర్స్ కాగా, మిగిలిన మూడు డ్యూయల్ టోన్‌ కలర్స్. మోనోటోన్ కలర్స్ లో నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండ్యుర్ గ్రే, చెస్ట్‌నట్ బ్రౌన్ మరియు ఓపులెంట్ రెడ్ కలర్స్ ఉన్నాయి. డ్యూయెల్ టోన్ కలర్స్ లో ఆర్కిటిక్ వైట్ విత్ బ్లాక్, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లాక్ మరియు ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి.

బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు

శ్రీవాణి గ్రాండ్ విటారా SUV ని తన భర్త మరియు పిల్లలతో కలిసి కొనుగోలు చేసిన తరువాత తన స్నేహితులకు, సన్నిహితులకు నాన్‌వెజ్‌ వంటకాలతో పార్టీ ఇచ్చింది. దీనికి సంబందించిన వీడియో కూడా తన యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఇప్పటికీ శ్రీవాణికి 6 లక్షల కంటే ఎక్కువ మంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారు.ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, January 27, 2023, 11:11 [IST]
English summary
Tv actress sreevani buys new maruti grand vitara details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+