Upcoming Cars in May మే నెలలో విడుదలయ్యే కార్ల జాబితా మీకోసం..
కారు కొనుగోలు చేయాలనుకునే వారు మే నెలలో వస్తున్న కార్లను కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు రూ.10 లక్షలుగా ఉన్నాయి. ప్రముఖ తయారీ సంస్థలు టాటా, మారుతీ సుజుకీ, మహీంద్రా కంపెనీలు ఈ కార్లను విడుదల చేయనున్నాయి. ప్రస్తుతం ఈ కార్లకు సంబంధించిన బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారు త్వరలోనే వీటిని సొంతం చేసుకోవచ్చు.
ఈ జాబితాలో ముందుగా మనం చర్చించుకోవాల్సిన కారు Tata Altroz CNG. టాటా నుంచి ఎంతో ఆసక్తిగా ఈ కారుకోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇది 1.2 లీటర్ సహజం ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. CNG మోడ్‌లో గరిష్టంగా 77 PS వద్ద 97 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఈ కారు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. ఈ కారు కోసం బుకింగ్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్ లను స్వీకరిస్తుంది.

కొత్త ఆల్ట్రోజ్ సీఎన్‌జీని దాదాపు రూ.10.55 లక్షల ప్రారంభ ధర వద్ద పొందవచ్చు. ఇది CNG కిట్‌ను పొందుతుంది కాబట్టి, ఇది మరింత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు 18.53 km/kg మైలేజీని అందించగలదు. ఆకర్షణీయంగా డిజైన్ చేయబడిన ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక కొద్దీ ఫీచర్లు ఉన్నాయి.
మే నెలలో భారీ అంచనాలు పెంచుతున్న మరో SUV మారుతి సుజుకి జిమ్నీ. ఇప్పటికే, భారత మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ 5-డోర్ మే నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. గత జనవరిలో ముగిసిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ ఆఫ్-రోడ్ SUVని ఆవిష్కరించింది. అప్పటి నుంచి దీనికి సంబంధించిన బుకింగ్‌లను సంస్థ స్వీకరిస్తుంది. అధిక మొత్తంలో కస్టమర్లు ఇప్పటికే దీనిని బుక్ చేసుకున్నారు. ఈ జిమ్నీ 5 డోర్ SUV ధర రూ.10-12 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

ఈ మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ SUV 1.5-లీటర్ 4-సిలిండర్ సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులోకి రానుంది. వినియోగదారులను ఆకర్షించే అనేక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. వీటిలో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
టాటా కాకుండా, మారుతి సుజుకి, మహీంద్రా థోర్ 3-డోర్ యొక్క AX (AC) బేస్ వేరియంట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో ముందు, రెండవ వరుస సీట్లతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అయితే ఈ వేరియంట్ లో కొన్ని ఫీచర్లు కోల్పోయే అవకాశం ఉంది. AX (O) వేరియంట్ కంటే ఇది తక్కువ ధరలో ఉండబోతుందని సమాచారం.

మహీంద్రా 3 డోర్ థార్ రూ.10.54 లక్షల నుంచి రూ.16.78 లక్షల ధరలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 2-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో RWD/4X4 ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
మొత్తం మీద టాటా, మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీలు ఒక్కొక్కటి ఆకర్షణీయంగా వివిధ రకాల కార్ల మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా జిమ్నీ 5 డోర్ ఎస్‌యూవీకి పెద్ద ఎత్తున బుకింగ్స్ వచ్చాయి. Altroz CNG దాని మైలేజీ కారణంగా వినియోగదారులను ఆకర్షిస్తున్నప్పటికీ, మహీంద్రా 3-డోర్ థార్ కూడా తక్కువ ధరకే లభించే అవకాశం ఉండనుంది.


Click it and Unblock the Notifications








