Upcoming Cars in April: ఏప్రిల్ లో విడుదలయ్యే కార్లు చాలా స్పెషల్..

కారు కొనాలని భావిస్తున్నారా అయితే వచ్చే నెల(ఏప్రిల్)లో అధునాతన కార్లు విడుదల కానున్నాయి. దేశంలోనే పేరొందిన మారుతి సుజుకితో పాటు బ్రిటన్ కి చెందిన ఎంజీ కామెట్, అలానే లంబోర్ఘిని, మెర్సెడెస్ వంటి హై ఎండ్ కార్లు రానున్నాయి. వాటి వివరాలు మీకోసం..

మారిన నూతన ఉద్గారల ప్రకారం మార్చి నెలలో కొన్ని ఎంపిక చేసిన కార్లపై ఆయా కంపెనీలు భారీ డిస్కౌంట్స్ ని అందిస్తున్నాయి. అయితే ఏప్రిల్ నుంచి కొత్త అనుమతులు తప్పనిసరి చేయడంతో త్వరలో నూతన ప్రమాణాలతో విడుదల కానున్న కార్లపై ఆసక్తి నెలకొంది. మొత్తం వచ్చే నెలలో కొన్ని ముఖ్య కార్లు విడుదల కానున్నాయి.

మారుతి ఫ్రాంక్స్

మారుతి ఫ్రాంక్స్..

ఈ జాబితాలో ముందుగా చర్చించుకోవాల్సింది మారుతి నుంచి వస్తున్న ఫ్రాంక్స్. ఈ కారు విడుదలకు ముందే సంచనాలను సృష్టించింది. ఏకంగా 15 వేలకు పైగా బుకింగ్స్ ని (మార్చి 25 నాటికి) ఈ కారు ఇప్పటికే పొందింది. సంస్థ అందిస్తున్న ఫీచర్లు నూతన భద్రతా ప్రమాణాలు వంటి సౌకర్యాలతో ఈ కారు అందుబాటులో ఉండనుంది.

గత జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ కారు సంస్థ ప్రదర్శించింది.. అప్పటి నుంచే ఈ కారుపై భారీ అంచనాలు పెరిగాయి. ఆసక్తి గల కస్టమర్‌లు నేటికి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. సరసమైన ధర రూ.7.50 లక్షలతో ఈ కారు కొనుగోలుకు అందుబాటులో ఉంది. టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటి కార్లకు ప్రధాన పోటీదారుగా ఈ కారు నిలువనుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. అవి 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్స్ తో కారు పనిచేయనుంది. అంతేకాకుండా, ఈ SUVలో 9.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆర్కామిస్ ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్ వంటి డజన్ల కొద్దీ వినూత్న ఫీచర్లను కలిగి ఉంది.

కామెట్ కారు

MG కామెట్...

ఈ జాబితాలో రాబోతున్న మరో కారు MG కామెట్. ఈ కారు గురించి చెప్పాలంటే, ఇది చాలా చిన్న ఎలక్ట్రిక్ కారు. ఇది భారతీయ రోడ్లపై తిరిగే 'రేవా' కారు లాగా ఉంటుంది. ఇందులో 20 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అదనంగా, దీనిలో అమర్చబడిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటారు గరిష్టంగా 40 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. దీంతో పాటు పూర్తి ఛార్జ్‌పై 200-250 కిమీల పరిధిని ఇస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బ్రిటన్ కు చెందిన MG కంపెనీ ఈ కారును 'గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్' (GSEV) ప్లాట్‌ఫారమ్‌లో రూపొందించింది. దాని తయారీ కోసం టాటా ఆటోకాంప్ నుండి బ్యాటరీలను స్థానికంగా సేకరించినందున ధర కొంచెం తక్కువగా ఉండవచ్చు. రూ.15 లక్షలలోపు కొనుగోలు చేయవచ్చు. అలాగే యువతను ఆకట్టుకునే టూ డోర్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి

లంబోర్ఘిని ఉరుస్..

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని ఏప్రిల్ చివరి నాటికి దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ 'ఉరస్ ఎస్' ఎస్‌యూవీని విడుదల చేయనుంది. ఇది 659 bhp వద్ద 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 305 కిమీ/గం వేగాన్ని కలిగి ఉంది. కేవలం 3.5 సెకన్లలో 0-100 కిమీ/గం నుండి వేగాన్ని ఈ కారు అందుకుంటుంది.

ఏప్రిల్ కార్స్

మెర్సిడెస్ 'AMG GT 63 SE పెర్ఫార్మెన్స్'..


మెర్సిడెస్ లో అత్యంత శక్తివంతమైన సెడాన్ 'AMG GT 63 SE పెర్ఫార్మెన్స్'ను ఏప్రిల్ 11న భారత్ లో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది 4.0-లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌తో 834.5 bhp వద్ద 1400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది కేవలం 2.9 సెకన్లలో 100కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.

మొత్తానికి వచ్చే నెలలో విడుదల కానున్న MG కామెట్ మారుతి సుజుకి ఫ్రాంక్స్.. వినియోగదారులకు అందుబాటు ధరల్లో లభ్యం కానున్నాయి. అయితే, Mercedes AMG GT 63 SE పెర్ఫార్మెన్స్, లంబోర్ఘిని Urus S ధర ఎక్కువగా ఉండనుంది. డెలివరీ ప్రారంభమైన తర్వాత ఈ కార్ల పనితీరు గురించి మరింత సమాచారం అందుబాటులోకి రానుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 25, 2023, 16:28 [IST]
English summary
Upcoming cars in the month of april 2023 in india full details in telugu
Read more on: #కార్లు #cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+