Upcoming SUV Facelifts రాబోయే రోజుల్లో విడుదల కానున్న ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ కార్లు..
ఇటీవలి కాలంలో భారత దేశంలో SUVలు బాగా ప్రాచుర్యం పొందాయి. చాలా మంది తయారీదారులు వీటిని ఉత్పత్తి చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉండటానికి ఆయా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. రాబోయే నెలల్లో టాప్ 5 ఫేస్‌లిఫ్ట్ SUVల జాబితా మీకోసం అందిస్తున్నాం..
అత్యంత జనాదరణ పొందిన కాంపాక్ట్ మిడ్-సైజ్ అప్‌డేట్ చేయబడిన ఫెస్ లిఫ్ట్ SUVలు రాబోయే నెలల్లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ కారు బ్రాండ్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిలో టాటా నెక్సాన్, హారియర్, సఫారి, కియా సెల్టోస్, సోనెట్, హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ మోడల్ లు ఉన్నాయి.

ముందుగా ఈ జాబితాలో అత్యధిక డిమాండ్ కలిగి ఉన్న టాటా నెక్సాన్ SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో విడుదల కానుంది. అప్‌డేట్ అవుతున్న ఈ కారు దేశంలోని రోడ్లపై చాలాసార్లు టెస్ట్ రన్ చేస్తూ కనిపించింది. ఈ SUV ఆగస్టు నెలలో విడుదల కానుంది. ICE-శక్తితో పనిచేసే Curvv కాన్సెప్ట్ కారు వలె, ముందు భాగం ఒక అరుదైన డిజైన్‌తో, ఆకర్షణీయమైన పూర్తి-వెడల్పు LED లైట్ బార్‌తో రానుంది.
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం అధునాతనంగా రానుంది. ఇందులో బిగ్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పాటు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉండవచ్చు. దీని ధరకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. రూ.8.50 - 15.00 లక్షల ధర వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది.

టాటా నుండి మరొక ప్రసిద్ధ SUV, ఫేస్‌లిఫ్టెడ్ హారియర్, అక్టోబర్ లో లేదా దీపావళికి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది చాలా అధునాతన ఫీచర్లను కలిగి ఉండనుంది. రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ తో దీనిని రూపొందించనున్నారు. ఇందులో 170 bhp పవర్ ఉత్పత్తి చేయగల 2.0 లీటర్ డీజిల్ ఇంజన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో వచ్చే అవకాశం ఉంది.
Tata Safari SUV ఇప్పటికే దేశీయ రోడ్లపై చాలా ప్రసిద్ధి పొందింది. ఈ కారు హారియర్‌లో ఉన్న ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా పొందవచ్చని అంచనా వేయబడింది. ఇది అక్టోబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీని ధరపై ఎలాంటి సమాచారం లేదు. అయితే సుమారు రూ. 16.00 - 17.00 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

హ్యుందాయ్ క్రెటా ఆకర్షణీయమైన అప్‌డేట్‌లతో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల చేయవచ్చు. ఇది భద్రత పరంగా మరింత అధునాతనంగా ఉంటుంది. ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్), 360 డిగ్రీ కెమెరాతో సహా అనేక ఫీచర్లను పొందుతుంది. కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 1.5-లీటర్ సహజ ఆస్పిరిటెడ్ పెట్రోల్ ఇంజన్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉందనుంది.

దక్షిణ కొరియాలో ప్రముఖ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన కియా, జూన్ లేదా జూలై నెలలో సెల్టోస్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇది ఆకర్షణీయమైన గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, ముందు, వెనుక భాగం మరింత అధునాతనంగా రానుంది. ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్)ని కలిగి ఉంటుంది. ఇది కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది.
కియా సోనెట్ కూడా ఈ ఏడాది డిసెంబర్‌లో దేశీయ విపణిలో చాలా ఫేస్‌లిఫ్ట్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది. 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ కారు ధర గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ఇది రూ.8.00 లక్షల నుండి రూ.15.00 లక్షల ధరలో లభించనుంది.


Click it and Unblock the Notifications








