త్వరలో విడుదల కానున్న మారుతి సుజుకి కార్లు ఇవే.. ఒక్కో కారులో సరికొత్త ప్రత్యేకతలు
దేశంలో మారుతి సుజుకి అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా ప్రజాదరణ పొందింది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో కొత్త మోడళ్లను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అత్యాధునిక డిజైన్, ఫీచర్లు, అందుబాటు ధరతో దేశీయ మార్కెట్లోకి కార్లను విడుదల చేసేందుకు మారుతి సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ కథనంలో..
మొదటగా మారుతి సుజుకి నుంచి స్విఫ్ట్(Swift)పై మార్కెట్‌లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మారుతి సుజుకి నాల్గవ తరం స్విఫ్ట్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. ఆ తర్వాత మరికొద్ది నెలల్లో విడుదల కానుంది. కొత్త స్విఫ్ట్ అధునాతన డిజైన్ మరియు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం. ఇది హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందని అంచనా.

ప్రస్తుతం, భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ వేరియంట్లను బట్టి రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.03 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్ మరియు CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలలో లభిస్తుంది. లీటరుకు 22.38 నుంచి 22.56 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ కారులో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
నాల్గవ తరం స్విఫ్ట్‌ను విడుదల చేసిన తర్వాత, మారుతి సుజుకి 2024 ద్వితీయార్థంలో సరికొత్త డిజైర్(Dzire)ను విడుదల చేయనుంది. దీని డిజైన్ మరియు ఫీచర్లు చాలా వరకు రాబోయే స్విఫ్ట్ కారుపై ఆధారపడి ఉంటాయి. కొత్త డిజైర్ 1.2 లీటర్ 3 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది 35-40 kmpl మైలేజీని అందించే అవకాశం ఉంది.

ప్రస్తుతం మారుతి సుజుకి డిజైర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.51 లక్షల నుంచి రూ.9.39 లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది. పెట్రోల్, CNG ఇంజిన్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. వేరియంట్లను బట్టి 22.41 - 22.61 kmpl మైలేజీని అందిస్తోంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో సహా అనేక రకాల ఫీచర్లను కలిగి ఉంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా(Grand Vitara) ఎస్‌యూవీని 2025 నాటికి సెవెన్-సీటర్ ఆప్షన్‌తో భారత మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ కారు ప్రస్తుతం 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ లేదా 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది, MG హెక్టర్ ప్లస్, టాటా సఫారీకి గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇప్పటికే దేశంలోని చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశాయి. మారుతీ సుజుకి మాత్రమే ఆ సెగ్మెంట్‌లో ఒక్క కారును కూడా విడుదల చేయలేదు. దాని కోసం, మారుతి సుజుకి చాలా సన్నాహాలు చేసింది. గత జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రొడక్షన్-రెడీ eVX కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఇది 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి ఛార్జింగ్‌పై 500 కి.మీ రేంజ్‌ను అందించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








