Upcoming Hybrid Cars త్వరలో మార్కెట్‌లోకి స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ కార్లు.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు..

కారు కొనడం ఎంతో మందికి కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. అందుకు తగ్గట్లుగా వాహనప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఆటో మొబైల్‌ కంపెనీలు పోటాపోటీగా సరికొత్త ఫీచర్లు, మంచి మైలేజీ, అదిరిపోయే లుక్‌, ఆకర్షించే కలర్స్‌లో కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నాయి.

రాబోయే రెండేళ్లలో, మార్కెట్లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీలు కొత్త కార్లను విడుదల చేయనున్నాయి. కాగా కార్ల తయారీదారులు స్ట్రాంగ్ - హైబ్రిడ్ కార్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ మార్కెట్‌లో రాబోయే రెండేళ్లలో లాంచ్ కానున్న స్ట్రాంగ్-హైబ్రిడ్ కార్ల గురించి సమాచారం మీ కోసం.

Toyota Fortuner legender

న్యూ జనరేషన్‌ టయోటా ఫార్చ్యూనర్(New Gen Toyota Fortuner) : టయోటా ఫార్చ్యూనర్ SUV చాలా సంవత్సరాలుగా భారతీయ మార్కెట్‌లో విక్రయించబడుతోంది. ఫార్చ్యూనర్ మరియు హిలక్స్ హైబ్రిడ్‌లను పవర్‌ట్రెయిన్‌లతో విడుదల చేయనున్నట్లు టయోటా సౌత్ ఆఫ్రికా ప్రకటించింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ కానుంది.

దక్షిణాఫ్రికాతో సహా విదేశీ మార్కెట్లలో ఈ మోడల్‌ లాంచ్‌ కానుంది. తరువాతి దశలో భారతీయ మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది, రాబోయే ఫార్చ్యూనర్ మరియు హిలక్స్.. కంపెనీ అధునాతన TNGA-F ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఇందులో ఎక్కువ టెక్నాలజీలు ఉంటాయి. ఈ ఎస్‌యూవీలో డీజిల్ హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది.

New Gen Swift

న్యూ-జెన్ స్విఫ్ట్(New Gen Swift): వచ్చే ఏడాది ప్రథమార్థంలో, మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్‌ను అనేక మార్పులతో తీసుకురానుంది. కొత్త బాహ్య అప్‌డేట్‌లు మరియు సరికొత్త ఇంటీరియర్‌ను కలిగి ఉండనుంది. 1.2 లీటర్ మూడు-సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రానున్నట్లు సంస్థ ప్రకటించింది. 35-40 kmpl మైలేజీని ఇస్తుంది.

మారుతి ఎంగేజ్ ఎమ్‌పివి: రానున్న రెండు నెలల్లో మారుతి సుజుకి ఎంగేజ్ ఎమ్‌పివిని భారతదేశంలో విడుదల చేయనుంది. ఇది టయోటా ఇన్నోవా హిక్రాస్ యొక్క బ్యాడ్జ్-ఇంజినీరింగ్ వెర్షన్. TNGA-C ప్లాట్‌ఫారమ్‌లో ADAS టెక్నాలజీని కలిగి ఉన్న మొదటి మారుతి సుజుకి మోడల్ ఇది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ని ఉపయోగించినట్లు సంస్థ వెల్లడించింది.

Maruti Suzuki Brezza

మారుతి కార్లు : మారుతి సుజుకి యొక్క బాలెనో, బ్రెజ్జా మరియు ఫ్రాంక్ కార్లను హైబ్రిడ్ వెర్షన్‌లుగా పరిచయం చేయవచ్చు. స్విఫ్ట్ మరియు డిజైర్‌లలో కొత్త 1.2 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, హైబ్రిడ్ వెర్షన్‌ల శ్రేణి ఈ మోడళ్లతో విస్తరించనుంది. ఈ మోడల్స్ అధిక మైలేజీని ఇస్తాయి.

కేంద్రం ప్రవేశపెట్టిన BS6 నిబంధనల ద్వారా మారుతీ.. డీజిల్ కార్ల నుండి పూర్తిగా నిష్క్రమించి CNG టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెడుతోంది. CNG ఫ్యూయెల్‌ ధర క్రమంగా పెరుగుతున్నందున, బ్రాండ్ భవిష్యత్తును రూపొందించడంలో బలమైన హైబ్రిడ్ సాంకేతికత, పురోగతి మరియు స్థానికీకరణ కీలకం కానున్నాయి. కావున బాలెనో, బ్రెజ్జా, ఫ్రాంక్‌ల వంటి అత్యధిక డిమాండ్‌ ఉన్న మోడళ్లు ఈ సాంకేతికతను అందిపుచ్చుకునే అవకాశం ఉంది.

Maruti Suzuki Baleno

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 29, 2023, 9:22 [IST]
English summary
Upcoming strong hybrid cars launch soon in india details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+