పెట్రోల్ తో పాటు కరెంట్ తో నడిచే అప్ కమింగ్ SUVలు మీకోసం.. 500కి.మీ వరకు ప్రయాణం..!

దేశంలో ఇటీవల ఎలక్ట్రిక్ కార్లు, SUVలు మార్కెట్లో వినియోగదారుల్నీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో భారత మార్కెట్లో కొత్త సిరీస్ ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల కానున్నాయి. పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో త్వరలోనే విడుదల కాబోయే అత్యాధునిక టాప్ SUVలు మీ కోసం..

టాటా కర్వ్..

టాటా కంపెనీ కర్వ్ ఎస్‌యూవీ కూపే వెర్షన్‌ను 2024లో ఆ సంస్థ విడుదల చేయనుంది. ఈ సరికొత్త ఎస్‌యూవీ కారు న్యూ GEN 2 హైబ్రిడ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది ICE, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ వేరియంట్‌లలో వస్తుంది. అయితే పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హిరిడర్, MG ఆస్టర్ వంటి వాటితో పోటీపడుతుంది. అలానే VW టైగూన్, స్కోడా కుషాక్ SUVలతో సమానంగా నిలువనుంది.

కర్వ్

అతి పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో దీనిని పొందే అవకాశం ఉంది ఇది దాదాపు 500కిమీల పరిధిని అందించనుంది. 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో ఇది పనిచేస్తుంది. SUV కూపే 125bhp వద్ద 225Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఆప్షన్ లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది.

టాటా సియెర్రా..

టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రొడక్షన్-రెడీ సియెర్రా ఎలక్ట్రిక్ SUVని ఆవిష్కరించింది. టాటా కార్ల లైనప్‌లో సఫారీ SUV అగ్రస్థానంలో ఉంది. ICE వేరియంట్‌లో లాంచ్ చేయబోతున్న సియెర్రా EV గ్రేటర్ నోయిడాలో 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది.

 టాటా సియెర్రా

హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ లో ఈ కారు రానుంది. Gen 2 వాహనాలపై టాటా ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ కారు SIGMA ఆర్కిటెక్చర్‌లో రూపొందించబడింది. ఎలక్ట్రిక్ వెర్షన్ 60-80kWh బ్యాటరీ ప్యాక్‌తో ఫ్రంట్-యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును స్టాండర్డ్‌గా పొందే అవకాశం ఉంది. ICE వెర్షన్ కారు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 170bhp వద్ద 280Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా హారియర్

టాటా హారియర్ & సఫారీ..

టాటా మోటార్స్ దాని ప్రసిద్ధ మధ్యతరహా SUVల జాబితాలో హారియర్, సఫారీకి లీడర్ గా నిలువనుంది. ఈ రెండు SUVలు భారతీయ రోడ్లపై అనేకసార్లు పరీక్షించబడ్డాయి. టాటా 2023 ఆటో ఎక్స్‌పోలో హారియర్ EV కాన్సెప్ట్‌ను సంస్థ ప్రదర్శించింది. హ్యారియర్ EV 2024లో దేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది.

అదేవిధంగా, సఫారి SUV 2024-25లో ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను పొందుతుంది. ఈ కొత్త SUVలు ల్యాండ్ రోవర్-ఉత్పన్నమైన OMEGA ఆర్క్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇవి టాటా GEN 2 EV ఆర్కిటెక్చర్‌తో అనుసంధానించబడతాయి. కొత్త టాటా హారియర్ సఫారి SUV ల గురించి మరింత సమాచారం రాబోయే రోజుల్లో కంపెనీ వెల్లడి చేయనుంది.

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా..

నిర్దిష్ట మార్పులతో కొత్త క్రెటా SUVని 2024లో విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ కంపెనీ ధృవీకరించింది. కొత్త మోడల్ గణనీయమైన డిజైన్ మార్పులు చేయనుంది. ADAS కార్యాచరణలతో నవీకరించబడిన క్యాబిన్‌ను పొందుతుంది. ఇది 3 ఇంజన్ ఆప్షన్లతో రానుంది. ఈ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ 2025లో విడుదల కానుంది.

కియా సెల్టోస్

కియా సెల్టోస్..

క్రెటా మాదిరిగానే, కియా ఇండియా కూడా మా మార్కెట్లో ICE,ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో కూడిన కొత్త సెల్టోస్ SUVని విడుదల చేస్తుంది. ICE వెర్షన్ ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయబడుతుందని నిపుణులు భావిస్తున్నారు, అయితే ఎలక్ట్రిక్ మోడల్ 2025లో అందుబాటులోకి రానుంది. క్రెటా SUVలో వచ్చే ఇంజిన్ ఎంపికలు కొత్త సెల్టోస్ కూడా చూడవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, March 20, 2023, 12:43 [IST]
English summary
Upcoming suvs with both petrol and ev powertrains here the details in telugu
Read more on: #కారు #car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+