టయోటా కొత్త కార్లు అదుర్స్‌.. వచ్చే ఏడాదిలోనే లాంచ్‌, క్రేజీ లుక్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లు.!

మరో నెల రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. 2024 లోకి కొత్త ఉత్సాహంతో ప్రవేశించేందుకు ఆటో మేకర్లు సిద్ధంగా ఉన్నారు. కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ను అందించేందుకు సరికొత్త కార్‌ మోడళ్లతో ప్రముఖ బ్రాండ్లు రానున్నాయి. కాగా ఆకట్టుకునే డిజైన్‌, ప్రీమియం లుక్‌ టయోటా మోడల్‌ కార్ల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో టయోటా మోటార్స్‌ నుంచి 7 కొత్త కార్లు విడుదల కానున్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్: కొత్త ఏడాదిలో టయోటా మోటార్స్ Toyota Urban Cruiser Taisor పేరుతో కొత్త కాంపాక్ట్ SUV కూపేని విడుదల చేయనుంది. కాగా ఇది మారుతి సుజుకి ఫ్రాంక్స్ రీబ్యాడ్జ్ వెర్షన్. ఈ 5 సీటర్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ 1.2 లీటర్‌ నేచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్, 1.0 లీ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో రానున్నాయి.

Toyota-Hilux-MHEV

టయోటా ఫార్చ్యూనర్ & హిలక్స్ మైల్డ్-హైబ్రిడ్: Hilux Mild- Hybrid వెర్షన్ యూరప్ మార్కెట్‌ను బేస్‌ చేసుకుని విడుదల కానుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పర్యావరణ హితంగా, మెరుగైన పనితీరుతో, ఫుల్‌ సైజ్‌ ఎస్‌యూవీగా రానుంది. కాగా వచ్చే ఏడాది ఇండియా-స్పెక్ మోడల్‌లు ఈ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను పొందే అవకాశాలు ఉన్నాయి.

టయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్(Toyota Camry Hybrid Facelift): 2023 LA ఆటో షో లో టయోటా క్యామ్రీ హైబ్రిడ్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను పరిచయం చేశారు. కాగా USలో, ఇది 2.5L పెట్రోల్/హైబ్రిడ్ ఇంజిన్‌తో పరిచయం చేయగా.. వచ్చే ఏడాది లేదా 2025లో భారత మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యాక ఇదే ఇంజిన్‌ను కలిగి ఉండే సూచనలు ఉన్నాయి.

Toyota-Camry-Hybrid

Toyota Fortuner & Hilux: 2023 పాన్ మొబిలిటీ షోలో IMV ప్లాట్‌ఫారమ్‌పై సరసమైన ధరలో IMV 0 పేరుతో ఒక కొత్త పికప్ ట్రక్ కాన్సెప్ట్‌ను టయోటా ఆవిష్కరించింది. ఆ తర్వాత తాజా ప్రాడో బేస్‌డ్‌ 4*4 కాంపాక్ట్‌ ఎస్‌యూవీ టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ పేరుతో రానుంది. భారత మార్కెట్లోకి కూడా ఇదే పేరుతో రానుంది. కాగా కొన్ని నెలల క్రితం ప్రాడో ఆఫ్‌రోడర్‌ టీజర్‌ ఆకట్టుకుంది.

టయోటా ఎలక్ట్రిక్‌(Electric SUV) ఎస్‌యూవీ: భారత మార్కెట్లో టయోటా నుంచి మొదటి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఇదే. ఇది ఇంటిరీయర్‌, ఎక్స్‌టీరియర్‌ పరంగా దాదాపుగా మారుతి సుజుకి eVXను పోలి ఉంటుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో సింగిల్, డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్‌తో రానుంది. పూర్తి ఛార్జ్‌పై 550 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌తో 2024 లో గ్లోబల్‌ మార్కెట్‌లోకి రానుంది. 2025లో భారత మార్కెట్‌లో లాంచ్‌ కానున్నట్లు సమాచారం.

Toyota-Land-Cruiser

7-సీటర్ టయోటా కరోలా క్రాస్ & నెక్స్ట్-జెన్ ఫార్చ్యూనర్: 2026 నాటికి కర్ణాటకలోని బిడాడి ప్లాంట్‌లో టయోటా కరోలా క్రాస్ స్ట్రెచ్డ్ వీల్‌బేస్ వెర్షన్ కొత్త ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ ఎస్‌యూవీ ఇన్నోవా హైక్రాస్‌ మాదిరిగా TNGA-C ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇంజిన్‌ విషయానికొస్తే ఈ ప్రీమియం ఎస్‌యూవీ 2.0L పెట్రోల్, 2.0L స్ట్రాంగ్‌ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండొచ్చు.

Toyota-Corolla-Cross

More from DriveSpark

Article Published On: Tuesday, November 28, 2023, 14:48 [IST]
English summary
Upcoming toyota car models in 2024 check out the details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+