2024 లో లాంచ్‌కు రెడీగా ఉన్న టాప్‌ కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. 500 కి.మీ రేంజ్‌.!!

మరికొద్ది రోజుల్లో 2024 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ ఏడాదిలో ఆటో మొబైల్‌ రంగంలో విస్తృత మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల హవా పెరిగిపోయింది. ఈ క్రమంలో దేశంలోనే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన టాటా, మారుతీ సుజుకీ, మహీంద్రా, బీవైడీలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

Tata Punch EV: కొత్త సంవత్సరంలో టాటా మోటార్స్‌ నుంచి ఎలక్ట్రిక్‌ కారు విడుదల కానుంది. టాటా పంచ్ EV ఇప్పటికే చాలా సార్లు రోడ్ ట్రయల్స్‌లో దర్శనమిచ్చింది. ఇందులో 24 kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 250 కి.మీ నుంచి 315 కి.మీల రేంజ్‌ను ఇస్తుంది. కారు ధర రూ.12 లక్షలుగా ఉండవచ్చు.

Tata-Curvv

2024లో టాటా మోటార్స్‌ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో EV Curvv SUV. చాలా సార్ట్‌ టెస్టింగ్‌కు సంబంధించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ కారు పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఫుల్ ఛార్జింగ్‌తో 500 కి.మీ రేంజ్‌ ఇవ్వనుంది. ధర రూ. 20 లక్షలు ఉండొచ్చని అంచనా. వీటితో పాటు హారియర్ మరియు సఫారీ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసే యోచనలో సంస్థ ఉంది.

Maruti Suzuki eVX: మారుతి సుజుకి, 2023 జనవరిలో న్యూ ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు eVX (కాన్సెప్ట్)ని ప్రదర్శించింది. ఈ కారులో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ 60 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించనున్నారు. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని సంస్థ తెలిపింది.

Suzuki-eVX

సమాచారం ప్రకారం, సుజుకి eVX ఎలక్ట్రిక్ కారు పొడవు 4300 mm, వెడల్పు 1800 mm మరియు ఎత్తు 1600 mmగా ఉంది. సింగిల్-మోటార్ లేదా డ్యూయల్-మోటార్ (ఆల్-వీల్ డ్రైవ్) సెటప్‌లలో ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది. డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్లతో రానున్న ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 25 లక్షల లోపు ఉండనుంది.

మరో దిగ్జజ కార్‌ మేకర్‌ మహీంద్రా కూడా భారత మార్కెట్లోకి 2 ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం, మార్కెట్లో అందుబాటులో ఉన్న XUV300 ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుంది. ఇందులో 35 kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే, పనితీరు గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

Mahindra-XUV-e8

కాగా ప్రముఖ XUV 700 ఆధారంగా మహీంద్రా XUV e8 (XUV.e8) ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తోంది. ఈ XUV E8 కారు అధునాతన డిజైన్‌ను కలిగి ఉండనుంది. ఇందులో 80 kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను ఉండవచ్చని సమాచారం. ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తున్న ఈ కారు ఫుల్ ఛార్జింగ్‌పై 450 కి.మీ రేంజ్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.

మరో ప్రముఖ కార్‌ మేకర్‌ BYD గత జనవరిలో ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో సీల్ సెడాన్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ కారు కూడా 2024లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సీల్ సెడాన్ 82.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు డ్యూయల్ మోటారు సెటప్‌తో పూర్తి ఛార్జ్‌పై 550-700 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని అంచనా.

BYD-SEAL

కాగా BYD SEAL సెడాన్ కేవలం 3.8 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది 15.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి వివిధ ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. ఇందులో మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)తో సహా వివిధ భద్రతా ఫీచర్లతో విడుదల కానుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 28, 2023, 18:29 [IST]
English summary
Upcomings electric cars with highest range in 2024 from tata maruti mahindra and byd
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+