జూలై 4 న మార్కెట్‌లోకి కొత్త కియా సెల్టోస్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఎస్‌యూవీ.. ధర, ఫీచర్లు ఇవే..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియాలో క్రమక్రమంగా ఆదరణ పొందుతోంది. ఇప్పుడు కియా నుంచి నవీకరించబడిన సెల్టోస్ SUV 2023 జూలై 4న దేశంలో ఆవిష్కరణ కానుంది. గతంలో జూన్‌ 2022 లో ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్(Facelifted Seltos SUV) గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించింది.

ఇప్పటికే భారతీయ రోడ్లపై ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్ ఎస్‌యూవీ అనేక సార్లు టెస్ట్ రన్ చేస్తూ కనిపించింది. అంతేకాకుండా వినియోగదారులు సైతం దానిపై భారీ అంచనాలతో ఉన్నారు. ఈ కొత్త సెల్టోస్ SUV ఎక్స్‌టీరియర్‌ మరియు ఇంటీరియర్‌లో అనేక ఆధునిక మార్పులను చేసింది. అంతేకాకుండా ఉత్తేజకరమైనదిగా కనిపించనుంది.

Kia-Seltos-Facelift

ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్ SUV పెద్ద గ్రిల్ ముఖ్యంగా ఎయిర్ డ్యామ్ తగ్గింపుతో వస్తుంది. అప్‌డేట్ చేయబడిన హెడ్‌లైట్లు, కొత్త LED DRLలను కలిగి ఉంటుంది. ఇది కొత్తగా రూపొందించబడిన 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్ మరియు స్లీకర్ టెయిల్‌లైట్‌లను కలిగి ఉంది. ఇది నవీకరించబడిన బంపర్‌ను కూడా కలిగి ఉంటుందని అంచనా.

కాగా నవీకరించబడిన కియా సెల్టోస్ SUV డజన్ల కొద్దీ వినూత్న ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. అప్‌డేటెడ్‌ ఎస్‌యూవీ ప్రధానంగా ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ స్క్రీన్‌ని పొందవచ్చు. ఇది కాకుండా, ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్స్ అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అనేక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

Kia-Seltos-Facelift

ప్రస్తుత సెల్టోస్ మోడల్‌ మాదిరి, వినియోగదారులు 1.5 లీటర్ అస్పిరేటెడ్‌ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను పొందవచ్చని భావిస్తున్నారు. నవీకరించబడిన కియా సెల్టోస్ SUV భద్రత పరంగా కూడా అధునాతనమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) లను కలిగే అవకాశం ఉంది.

నవీకరించబడిన సెల్టోస్ ఎస్‌యూవీ కియా కారెన్స్, హ్యుందాయ్ యొక్క వెర్నా సెడాన్ మరియు అల్కాజార్ SUVలలో మాదిరి అదే 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ని పొందవచ్చు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 158 bhp శక్తి వద్ద 253 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో అందుబాటులో ఉండనుంది.

Kia-Seltos-Facelift

అప్‌డేటెడ్‌ కియా ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్ SUV ఐదు సీట్ల వేరియంట్‌లో రూ. 10 లక్షల బేస్‌ ధరలో అందుబాటులో ఉంటుందని అంచనా. అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. ఈ కారు హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, వోక్స్‌వ్యాగన్ టిగువాన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, హ్యుందాయ్ క్రెటా మరియు సిట్రస్ C3 ఎయిర్‌క్రాస్‌లతో పోటీ పడనుంది.

ఇతర కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ కియా అప్‌డేట్ చేయబడిన సెల్టోస్ ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేస్తుండటం శుభపరిణామం. 2019లో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించిన కియా ఇప్పటికే ఊహించిన దానికంటే ఎక్కువ పురోగతిని సాధించింది. దీంతో అప్‌డేట్ చేయబడిన సెల్టోస్‌కి వినియోగదారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Kia-Seltos-Facelift

More from DriveSpark

Article Published On: Tuesday, June 20, 2023, 12:25 [IST]
English summary
Updated kia seltos facelift suv will unveil on july 5th details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+