తక్కువ ధరలో చిన్న ఎలక్ట్రిక్ కార్ల విడుదలకు వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ ప్రణాళిక..?
భారత్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric vehicles) డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా కార్ల తయారీ సంస్థలు కూడా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ సంస్థ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఇందుకోసం సరైన భాగస్వామి కోసం వెతుకుతోందని సమాచారం.
అయితే ఎంట్రీ లెవల్ ఈవీ కోసం వోక్స్‌వ్యాగన్ సంస్థ రెనాల్ట్‌తో (Volkswagen and renault EV) చర్చలు జరుపుతోందని జర్మన్ మీడియా సంస్థ హ్యాండెల్స్‌బ్లాట్ వెల్లడించింది. చర్చలు సఫలం అయితే సంవత్సరానికి 2 లక్షల నుంచి 2.5 లక్షల కార్లను తయారుచేయాలన్నది ఈ రెండు సంస్థల ప్రణాళికగా తెలుస్తోంది. చిన్న ఎలక్ట్రిక్ కార్లను తయారుచేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ ఒప్పందంపై వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ సంస్థలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఈ రెండు సంస్థలు తమ సొంత ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఎంట్రీ లెవల్ మార్కెట్‌లో ఉన్న అవకాశాలను ఈ రెండు సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. అందువల్ల తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రెనాల్ట్ సంస్థ ట్వింగో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను 2026 నాటికి విడుదల చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. బడ్జెట్ రేంజ్‌లో ఈ వాహనాన్ని పరిచయం చేయాలని రెనాల్ట్ భావిస్తోంది. ట్వింగో ఈవీ రెనాల్ట్ 5, 4 మరియు నిస్సాన్ మైక్రా ఈవీ ఆధారిత Ampr ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తోంది. వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ రెండు సంస్థలు ఒకే తరహా లక్ష్యంతో పనిచేస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది.

ఎప్పటికి విడుదల కానుందంటే.. : సుమారు రూ.18 లక్షల ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వోక్స్‌వ్యాగన్ గ్రూప్ CFO ఆర్నో వెల్లడించారు. 2025 తర్వాత ఈ కారును విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లోకి అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతున్నా.. బడ్జెట్ రేంజ్‌లో విడుదల అవుతున్న వాహనాల సంస్థ తక్కువగా ఉంటోంది. బడ్జెట్ రేంజ్‌లో ఎలక్ట్రిక్ కార్లను తయారుచేసేందుకు వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సంస్థల నుంచి ఎటువంటి స్పందన లేదు.

భారత్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు సంసిద్ధంగా ఉన్నా... మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్లు సహా ఇతర సదుపాయాలు అందుబాటులోకి వస్తే.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








