ఇయర్ ఎండ్ సేల్‌.. Volkswagen కారుపై రూ.4.2 లక్షల విలువైన డిస్కౌంట్‌..!

భారత్‌ మార్కెట్‌లో ప్రముఖ కార్ల తయారీ సంస్థగా ఉన్న వోక్స్‌వ్యాగన్‌.. తన టైగన్‌ మోడల్‌పై (Volkswagen tiguan)భారీ తగ్గింపును ప్రకటన చేసింది. ఇయర్‌ ఎండ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ కారు ధరపై సంస్థ భారీగా ధర తగ్గించింది. వోక్స్‌వ్యాగన్‌ కారు ధర రూ.35.17 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది.

ఆఫర్‌లో భాగంగా వోక్స్‌వ్యాగన్‌ టైగన్‌ కారుపైన రూ.4.2 లక్షల విలువైన డిస్కౌంట్‌ ఇచ్చింది. దీంతో కారు ధర రూ.30.97 లక్షలకు తగ్గింది. ఇందులో రూ.75 వేల నగదు తగ్గింపు, రూ.75 వేల ఎక్స్చేంజ్‌ బోనస్‌, రూ. లక్ష వరకు కార్పొరేట్ బెనిఫిట్‌, 86 వేల విలువైన 4 సంవత్సరాల సర్వీస్‌ ప్యాకేజీ, రూ.84 వేల విలువైన ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.

Volkswagen tiguan SUV

వోక్స్‌వ్యాగన్‌ టైగన్‌ 5- సీటర్‌ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. నైట్‌షేడ్ బ్లూ, ప్యూర్‌ వైట్‌, ఒరిక్స్‌ వైట్‌, డీప్‌ బ్లాక్‌, డాల్ఫిన్‌ గ్రే, రిఫ్లెక్స్‌ సిల్వర్‌ వంటి 7 మోనోటోన్‌ రంగుల్లో లభిస్తుంది. మరియు ఈ కారు ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

ఈ ఎస్‌యూవీ 2- లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 190 PS శక్తి, 320Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 7-స్పీడ్‌ DCT డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

Volkswagen tiguan SUV news

వోక్స్‌వ్యాగన్ టైగన్ ఆకర్షణీయ డిజైన్‌ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. 8- అంగుళాల టచ్‌స్క్రీన్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఆకర్షణీయమైన సన్‌రూఫ్, కనెక్టడ్‌ కార్ టెక్‌, 3-జోన్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్‌, 30-కలర్‌ యాంబియంట్‌ లైటింగ్‌ వంటి అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది.

భద్రత పరంగాను వోక్స్‌వ్యాగన్‌ టైగన్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. 6- ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్ సిస్టమ్, ESC ( ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్ ), హిల్‌ అసిస్ట్‌, హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌, పార్కింగ్ అసిస్ట్‌, రియర్‌ వ్యూ కెమెరా మరియు ISOFIX చైల్డ్‌ సీట్‌ వంటి వివిధ భద్రత లక్షణాలను కలిగి ఉంది.

Volkswagen tiguan SUV design

ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా వోక్స్‌వ్యాగన్‌ టైగన్‌ SUVపై రూ.4.2 లక్షల డిస్కౌంట్‌ను ఇచ్చింది. ఈ కారణంగా విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. ఫలితంగా టైగున్‌ SUVకి భారీ డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కారుకు జీప్‌ కంపాస్‌, హ్యుందాయ్‌ టక్సన్‌ మరియు సిట్రస్‌ C5 ఎయిర్‌క్రాస్‌ పోటీ వాహనాలుగా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 6, 2023, 15:56 [IST]
English summary
Volkswagen tiguan suv attracts with rs4 2 lakh worth discount in year end discount
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+