Volvo C40 Recharge ఎలక్ట్రిక్ కారు డెలివరీలు ప్రారంభం.. 530 కి.మీ రేంజ్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో భారత్ మార్కెట్‌లో ఇటీవల Volvo C40 Recharge పేరుతో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.61.25 లక్షలుగా ఉంది. వోల్వో ఈ కొత్త కార్ల డెలివరీని ప్రారంభించింది. వోల్వో C40 రీఛార్జ్ కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు లక్ష రూపాయలు చెల్లించి వోల్వో అధికారిక వైబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
వోల్వో C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో కియా EV6 ఎలక్ట్రిక్ కారుకు పోటీగా ఉంది. వోల్వో C40 రీఛార్జ్ కారు డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 78kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది కారు మోటార్ 405 bhp శక్తి, 660Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 530 కి.మీ రేంజ్ ఇస్తుంది.

వోల్వో C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని 150kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను కలిగి ఉంటుంది. 10 నుంచి 80 శాతం ఛార్జింగ్‌ను కేవలం 27 నిమిషాల్లో ఛార్జింగ్ చేయవచ్చు. ఈ కారు కేవలం 4.7 సెకన్లలో 0-100 kmph కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. C40 రీఛార్జ్ కారు 180 kmph గరిష్ట వేగంతో ప్రయాణం చేయగలదని వోల్వో తెలిపింది.
ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్ ఆకట్టుకుంటుంది. థోర్స్‌హామర్ హెడ్‌లైట్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ట్విన్ మినీ స్పాయిలర్‌ల మాదిరిగా రూఫ్ రైల్ డిజైన్‌కు కొంత స్పోర్టినెస్‌ను జోడిస్తుంది. వోల్వో ఎలక్ట్రిక్ కారు 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు సిరస్ వైట్, ఒనిక్స్ బ్లాక్, ఫ్యూజన్ రెడ్, క్లౌడ్ బ్లూ, ఫోర్డ్ బ్లూ మరియ సేజ్ గ్రీన్ వంటి ఆరు రంగుల్లో లభిస్తుంది.

వోల్వో C40 కారు క్యాబిన్‌లో 12.3 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 9 అంగుళాల ఇన్పోటైన్‌మెంట్ స్క్రీన్‌లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆధారిత గూగుల్ సాఫ్ట్‌వేర్ సెటప్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్టు చేస్తుంది. ఈ స్క్రీన్ హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడుతుంది.
వోల్వో C40 రీఛార్జ్ కారు మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. మల్టీ ఎయిర్‌బ్యాగ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ సహా ADAS - అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి కీలకమైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








