దీపావళి ఫెస్టివ్‌ డిలైట్‌ ఆఫర్‌... ఈ కారుపై రూ.7 లక్షలు వరకు తగ్గింపు..!

భారత్‌లో సాధారణంగా పండుగ సీజన్‌లో భారీగా విక్రయాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా దీపావళి పండుగల సమయంలో ప్రజలు ఎక్కువగా కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కార్ల తయారీ సంస్థలు కూడా వివిధ మోడళ్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ వాల్వో (Volvo Diwai Offer) రెండు కార్లపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది.

భారీ ఆఫర్‌ : వోల్వో ఇండియా దీపావళి పండుగ సందర్భంగా ఫెస్టివ్‌ డిలైట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. సుమారు రూ.7 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పండుగ సందర్భంగా విక్రయాలను పెంచుకోవాలని వోల్వో సంస్థ భావిస్తోంది. వాల్వో XC40 రీఛార్జ్ EV మరియు XC60 SUVపై భారీ తగ్గింపులను ప్రకటించింది. వోల్వో XC40 కాంప్లిమెంటరీ 3 సంవత్సరాల రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, 3 సంవత్సరాల సమగ్ర కారు వారంటీని అందిస్తోంది.

volvo xc40 recharge

XC40 రీఛార్జ్‌ ఎలక్ట్రిక్‌ కారుపై రూ.1,78,500 తగ్గింపు : పండుగ సందర్భంగా 3 సంవత్సరాలు వోల్వో కారు సర్వీస్‌ ప్లాన్‌, 4 సంవత్సరాల డిజిటల్‌ సేవలు, 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 11kW వాల్‌ బాక్స్ ఛార్జర్‌ మరియు Tre Kronor ప్రత్యేకతలున్నాయి.

వోల్వో XC40 రీఛార్జ్‌ ఎలక్ట్రిక్‌ SUV గతంలో ధర రూ.56.90 లక్షలు (ఎక్స్‌ షోరూం). ప్రస్తుతం ఆఫర్‌లో భాగంగా ఈ కారును రూ.55.12 లక్షలు (ఎక్స్‌ షోరూం)కు కొనుగోలు చేయవచ్చు. ఈ కారుపై దీపావళి ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా సంస్థ రూ.1,78,500 తగ్గింపును అందిస్తోంది.

volvo xc60 car

వోల్వో XC60పై రూ.6.95 లక్షలు తగ్గింపు : వోల్వో XC60 లగ్జరీ ఎస్‌యూవీ ధర రూ.67.85 లక్షల కాగా దీపావళి ఆఫర్‌లో భాగంగా కారు ధరను రూ.60.90 లక్షలకు తగ్గించింది. అంటే సుమారు రూ.6.95 లక్షల తగ్గింపును పొందవచ్చు. దీపావళి ఫెస్టివ్‌ డిలైట్‌ ఆఫర్‌.. స్టాక్‌ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని వోల్వో సంస్థ తెలిపింది.

వోల్వో XC60 2022 సెప్టెంబర్‌లో భారత్‌లో విడుదల అయింది. ఈ కారు ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒనిక్స్‌ బ్లాక్‌, డెనిమ్‌ బ్లూ, ప్లాటినం గ్రే, బ్రైట్‌ డస్క్‌, క్రిస్టల్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ కారు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ 2.0 లీటర్‌ 4 సిలిండర్‌ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ పెట్రోల్‌ ఇంజిన్‌ 48 వోల్ట్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌తో జతచేయబడింది.

volvo xc60

ఈ ఇంజిన్‌ 250bhp శక్తి, 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత సంవత్సరం విడుదల అయిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ XC60 ఫ్రంట్‌ గ్రిల్‌, ఫ్రంట్‌ బంపర్‌ మరియు అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ దీపావళి ఆఫర్‌ స్టాక్‌ ఉన్నంత వరకే వర్తిస్తుందని వోల్వో ఇండియా వెల్లడించింది. పూర్తి వివరాలకు సమీపంలోని షోరూంలను సంప్రదించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, November 11, 2023, 9:53 [IST]
English summary
Volvo india great discount on xc60 suv upto 7 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+