రూ. 3.5 లక్షల ధరకే ఎలక్ట్రిక్ కారు.. ఆకర్షణీయ డిజైన్, ఫీచర్లు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. కాగా.. ఫ్యూయెల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధర కాస్త ఎక్కువే. ఎందుకంటే వీటిలో ఫ్యూయెల్ నింపే అవసరం ఉండదు. కేవలం బ్యాటరీ ఛార్జ్ చేస్తే సరిపోతుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది.
ఈ క్రమంలో కస్టమర్లకు బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కారును ఓ సంస్థ విడుదల చేసింది. దీని ధర కేవలం రూ. 3.50 లక్షలు మాత్రమే. ఇది ఆకర్షణీయమైన, పర్యావరణ అనుకూలమైన మైక్రో ఈవీ. అయితే ఆ కారు పేరేంటి.. ఫీచర్లు, తదితర వివరాలను ఈ కథనంలో మీ కోసం..

మైక్రో EV విభాగంలో మార్కెట్ వాటాను పెంచే ప్రణాళికలతో.. ఫస్ట్ ఆటో వర్క్స్ (FAW) బెస్ట్యూన్ బ్రాండ్ పేరుతో Xiaoma చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఈ నెలలో ప్రీ సేల్స్ ప్రారంభం కానున్నాయి. FAW Bestune Xiaoma ప్రధానంగా Wuling Hongguang MINI EVకి గట్టి పోటీనిస్తోంది. ఇది ప్రస్తుతం చైనాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో కారు.
Bestune Xiaoma ధర సుమారు రూ. 3.47 లక్షల నుంచి రూ. 5.78 లక్షల పరిధిలో అందుబాటులో ఉంది. కాగా ఫా(FAW) ఈ సంవత్సరం ఏప్రిల్‌లో షాంఘై ఆటో షోలో బెస్ట్యూన్ షియోమాను ఆవిష్కరించింది. హార్డ్‌టాప్, కన్వర్టిబుల్ వెర్షన్‌లు రెండింటినీ ఆవిష్కరించినప్పటికీ, హార్డ్‌టాప్ వేరియంట్ మాత్రమే ప్రస్తుతం విక్రయానికి ఉంది.

షియోమా డిజైన్‌ను పరిశీలిస్తే ఇది ఒక బాక్సీ ప్రొఫైల్‌తో వస్తుంది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌తో ఆకర్షణీయంగా ఉంది. సర్కిల్ షేప్ కార్నర్స్‌తో పెద్ద చతురస్రాకార హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఇందులో ఏరోడైనమిక్ వీల్‌ను అమర్చారు. ఫ్రంట్ భాగంలో ఉన్న మాదిరిగానే వెనుకవైపు, టెయిల్ ల్యాంప్స్, బంపర్ ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఇందులో ఫీచర్ల విషయానికొస్తే.. ఫ్లాట్ డ్యాష్‌బోర్డ్, రోటరీ కంట్రోల్ డయల్స్‌తో ఇంటీరియర్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. టచ్‌స్క్రీన్ 7 అంగుళాల యూనిట్‌తో వస్తుంది. డ్యాష్‌బోర్డ్ ఆకర్షణీయమైన డ్యూయల్ టోన్ థీమ్‌ను కలిగి ఉంది. Xiaomaలో గ్లాసెస్ కి ఏ మెటీరియల్ ఉపయోగిస్తారో అదే వినియోగించడం వల్ల ఇంటీరియర్ స్మూత్ ఫినిషింగ్‌తో ఉంటుంది.

Bestune Xiaoma FME ప్లాట్‌ఫాంపై రూపొందించారు. ఇందులో EV, రేంజ్ ఎక్స్‌టెండర్ డెడికేటెడ్ ఛాసిస్‌తో వస్తుంది. మైక్రో కారు సరసమైన ధర, సులభమైన పార్కింగ్, పుష్కలమైన మైలేజ్ మరియు కార్బన్ ఫ్రీ వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుంది.
ఇంతకు ముందు, ఇదే ప్లాట్‌ఫారమ్‌పై NAT అనే రైడ్-హెయిలింగ్ EVని రూపొందించారు. FME ప్లాట్‌ఫారమ్‌లో A1 మరియు A2 అనే రెండు ఉప-ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. A1 ఉప-ప్లాట్‌ఫారమ్ 2700-2850 mm వీల్‌బేస్‌తో సబ్‌కాంపాక్ట్‌లు మరియు కాంపాక్ట్‌లను అందిస్తుంది.

A2 2700-3000 mm వీల్‌బేస్ కలిగిన కార్ల కోసం ఉపయోగించారు. ఇవి ఒకే ఛార్జ్‌పై EVలకు 800 కి.మీ మరియు ఎక్స్‌టెండర్లకు 1,200 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తాయి. రెండు ప్లాట్‌ఫారమ్‌లు 800 V ఆర్కిటెక్చర్‌కు సపోర్ట్ ఉంటుంది. మైక్రో EV 20 kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది.
కాగా షియోమాలో పవర్‌ట్రెయిన్ గురించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భద్రత పరంగా, బెస్టూన్ షియోమా డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌ను పొందుతుంది. కొలతల పరంగా, 3-డోర్ సెడాన్ Xiaomi పొడవు 3,000 mm, వెడల్పు 1,510 mm మరియు ఎత్తు 1,630 mm. దీని వీల్ బేస్ 1,953 మిమీను కలిగి ఉంది.

మైక్రో EVలు భారతదేశంలో తమదైన ముద్ర వేయనప్పటికీ , ఈ కార్లు చైనా మరియు ఆగ్నేయాసియా దేశాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఐరోపా మార్కెట్లలో కూడా వాటికి ఆదరణ లభిస్తున్నట్లు కనిపిస్తోంది. మైక్రో కారు సరసమైన ధర, సులభమైన పార్కింగ్, విస్తారమైన రేంజ్ మరియు జీరో ఎమిషన్స్ వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








