800 కి.మీ రేంజ్ ఎలక్ట్రిక్ కారును రూపొందించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ.. ఈ కారు ప్రత్యేకతలు తెలుసా?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ తన తొలి ఎలక్ట్రిక్ కారు SU7ను (Xiaomi SU7 Electric Car) ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కొత్త ఈవీ తమ వినియోగదారుల కోరికలను నేరవేర్చేందుకు రూపొందించిందని షియోమీ ప్రెసిడెంట్, సీఈవో లీ జున్ తెలిపారు.
పోర్షే మరియు టెస్లా వంటి డ్రీమ్ కార్లను తయారు చేయడమే షియోమీ లక్ష్యమని చెప్పారు. అయితే తాను ఏ కంపెనీతో పోటీపడడం లేదని లీ జున్ ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాను పోటీ ఇవ్వనుందా అనే చర్చ జరుగుతోంది.

షియోమీ SU7 ఎలక్ట్రిక్ కారు డిజైన్ : షియోమీ కొత్త SU7 డిజైన్ చాలా వరకు పోర్షే కారు మాదిరిగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 4 డోర్ ఆప్షన్‌తో వస్తుంది. 4997mm పొడవు, 1963mm వెడల్పు, 1455mm ఎత్తు, 3000mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.
ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లో వస్తుంది. 73.6kWh బ్యాటరీ ప్యాక్, 101kWh బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ వినూత్నమైన CTB (సెల్ టు బాడీ) టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌పై 800 కి.మీల పరిధిని అందిస్తుంది. షియోమీ SU7 v6 మరియు V6S మోటార్ ఆప్షన్లతో అందుబాటులోకి వస్తుంది.

షియోమీ SU7 ఎలక్ట్రిక్ కారు వేరియంట్‌ను బట్టి 299hp నుంచి 374hp శక్తి మరియు 635Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఎంట్రీ లెవల్ మోడల్ గరిష్ఠంగా 210 kmph మరియు టాప్ ఎండ్ మోడల్ గరిష్ఠంగా 265 kmph వేగంతో ప్రయాణం చేస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు క్యాబిన్ విశాలంగా ఉంటుంది. అయితే ఇందులో అల్లాయ్ వీల్స్‌తోపాటు సెల్ఫ్ డ్రైవ్ టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది. ఈ షియోమీ SU7 ఎలక్ట్రిక్ సెడాన్ మరికొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించబడుతుంది. ఆ తర్వాత భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

బ్యాటరీ ప్యాక్ వివరాలు : దీంతో పాటు షియోమీ v8 (Xiaomi V8) పేరుతో మరో వేరియంట్‌ను తయారు చేస్తోంది. ఈ కారు 150 kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుందని తెలుస్తోంది. సింగిల్ ఛార్జింగ్‌తో 1200 కి.మీ రేంజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఈ కారు 2025 సంవత్సరంలో విడుదల కానుందని తెలుస్తోంది.
షియోమీ SU7 ఎలక్ట్రిక్ సెడాన్.. టెస్లా మోడల్ 3 మరియు మోడల్ S కార్లకు పోటీగా ఉండే అవకాశం ఉంది. టెస్లా సంస్థ ఈ జనవరిలో భారత్‌లో అరంగేట్రం చేయనుంది. గుజరాత్‌లోని సనంద్‌లో టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. జనవరిలో జరగనున్న వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








