హ్యుందాయ్‌ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్‌.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్‌ క్యాంప్‌.. ఎప్పటివరకు అంటే.??

దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్స్‌.. తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది. వేసవి కాలం ప్రవేశించడంతో హ్యుందాయ్‌(Hyundai India) కస్టమర్ల కోసం ప్రత్యేకంగా వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ శిబిరం ద్వారా కస్టమర్లు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవి కాలం వచ్చేసింది. ఎండ ధాటికి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కారు, బస్సుల్లో ప్రయాణిస్తుంటే ఉక్కపోతే. లాంగ్‌ జర్నీలు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇక కార్లలో అయితే ఏసీ లేనిదే ప్రయాణించడం కష్టం.

Hyundai-12-Day-Long-Summer-Service-Camp

ఈ క్రమంలో కార్లలో ప్రయాణించేవారు వేసవిలో ఏసీ లేనిదే ఎక్కువ దూరం కాదు.. చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయలేరు. ఇదిలా ఉండగా ఈ కాలంలో తరచూ AC సమస్యలు(Hyundai 12 Day Summer Service Camp) వస్తుంటాయి. ఇంకా ఇంజిన్ వేడెక్కడం లాంటి కొన్ని మెకానికల్‌ ప్రాబ్లమ్స్‌ కూడా వస్తుంటాయి. ఇందుకోసం తరచూ షెడ్డుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ.. హ్యుందాయ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తన కార్ల యజమానుల కోసం వార్షిక వేసవి సేవా శిబిరాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక వేసవి శిబిరం ద్వారా హ్యుందాయ్‌ కస్టమర్లు.. 12 రోజుల పాటు ఈ సేవలను(12 Day Long Summer Service Camp) సద్వినియోగం చేసుకోవచ్చు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 7, 2024 వరకు ఈ శిబిరం అందుబాటులో ఉంటుంది.

Hyundai-12-Day-Long-Summer-Service-Camp

ఈ ప్రత్యేక వేసవి శిబిరం ద్వారా హ్యుందాయ్ ఇండియా కస్టమర్లు.. సర్వీస్‌పై పలు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ శిబిరం ద్వారా అందించే పలు సర్వీసులపై తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తోంది. కస్టమర్లు ఉచితంగా తమ కారులో AC చెకప్‌ చేయించుకోవచ్చు. AC సర్వీసింగ్, వీల్ అలైన్‌మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, AC డిస్ ఇన్‌ఫెస్టేషన్, వాష్ మరియు లేబర్ ఖర్చుపై 15 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Hyundai-12-Day-Long-Summer-Service-Camp

ఇంకా ఈ శిబిరం ద్వారా హ్యుందాయ్‌ ఇండియా అందించే సర్వీస్ వివరాలు, పూర్తి సమాచారంపై కస్టమర్లు తమ సమీప హ్యుందాయ్-అధీకృత డీలర్‌షిప్‌లు లేదా సర్వీస్ స్టేషన్‌లను సంప్రదించవచ్చు. వేసవిలో తరచూ కార్ల యజమానులు.. తమ వాహనాల్లో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. హ్యుందాయ్‌ అందించే ఈ ప్రత్యేక వేసవి శిబిరం ద్వారా కస్టమర్లు చాలా వరకు డబ్బు ఆదాయం అవుతుంది.

భారత మార్కెట్లో ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్స్‌.. గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఐ20, ఐ20 ఎన్ లైన్, ఎక్స్‌టర్, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, క్రెటా, క్రెటా ఎన్ లైన్, వెర్నా, అల్కాజర్, కోనా ఎలక్ట్రిక్, టక్సన్ మరియు ఐయోనిక్ 5 వంటి 14 మోడళ్లను విక్రయిస్తోంది. ఈ ఎస్‌యూవీలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ కార్ల వాహనదారులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Hyundai-12-Day-Long-Summer-Service-Camp

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, March 28, 2024, 13:53 [IST]
English summary
12 day long summer service camp for hyundai india customers discounts on various services
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+