2024లో విడుదలైన టాప్‌ 5 కార్లు.. ఆల్‌రౌండ్‌ ఫర్ఫామెన్స్‌కి పెట్టింది పేరు.. ఇవే కావాలంటున్న కస్టమర్లు!

భారతదేశం గ్లోబల్ కారు మార్కెట్‌గా అవతరిస్తోంది. అనేక అంతర్జాతీయ కార్ల ఉత్పత్తి సంస్థలు భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఇంకా కొన్ని కంపెనీలు తమ ఉనికిని భారత్‌లోనూ విస్తరించడానికి ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని విదేశీ కార్ల బ్రాండ్లు విజయవంతమయ్యాయి. ప్రతి సంవత్సరం భారత్‌లో కొత్త కార్ల రాకతో ఆటో మార్కెట్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తుంది. మన దగ్గర పేరొందిన కంపనీలు కూడా కొత్త ఉత్పత్తులపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నాయి. అదే కోవాలో కొన్ని విదేశీ, స్వదేశీ కంపెనీలు 2024లో విడుదల చేసిన కార్లు మార్కెట్‌లో దుమ్మురేపాయి. 2024లో లాంచ్‌ అయిన ది బెస్ట్‌ కార్ల వివరాలు మీకోసం..

సిట్రోయిన్‌ బసాల్ట్: ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమేకర్స్ భారత్‌లో తమ ఉనికిని కాపాడుకునేందుకు తీసుకువచ్చిన ఈ కూపే స్టైల్‌ ఎస్‌యూవీ మంచి హిట్ టాక్‌ని కలిగి ఉంది. ఈ బాసాల్ట్ ఎస్‌యూవీ మార్కెట్‌లో నేరుగా టాటా కర్వ్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించబడిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బడ్జెట్‌లో మంచి కారు చూసేవారు దీనిని ట్రై చేయవచ్చు.

2024 Tata Curvv

టాటా కర్వ్‌: నెక్సాన్, పంచ్ మోడళ్ల విజయం తర్వాత టాటా మోటార్స్ ఈ కర్వ్‌ను రంగంలోకి దింపింది. ఇది ఐసీఈ, ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దేశంలోనే మొట్టమొదటి కూపే స్టైల్‌ ఎస్‌యూవీ కారు ఇదే కావడం గమనార్హం. ఐసీఈ వెర్షన్‌ ధరలు రూ. 9.0 లక్షల నుంచి, ఈవీ ప్రారంభ ధర రూ. 17.49 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఎంజీ విండ్సర్‌ ఈవీ: ఈ సంస్థ భారత్‌లో ఈవీ మార్కెట్‌పై మంచి గ్రిప్‌ని పెంచుకుంటోంది. తాజాగా ఈ కంపెనీకి చెందిన కార్లు మార్కెట్‌లో టాటా మోటార్స్‌ ఈవీ కార్లను వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని సంపాదించాయి. ఈ ఎంజీ విండ్సర్ ఈవీని బ్యాటరీ-యాజ్‌-ఏ-సర్వీస్ కింద కేవలం రూ. 9.99 లక్షలకే (ఎక్స్‌షోరూమ్‌) ఇంటికి తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ కారు బెస్ట్ సెల్లింగ్‌ ఎలక్ట్రిక్‌ కారుగా ఉంది.

2024 Mahindra Thar Roxx

మహీంద్రా థార్‌ రాక్స్‌: మహీంద్రా థార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆగస్టు 15న థార్ 5 డోర్ వెర్షన్‌ రాక్స్‌ని మహీంద్రా విడుదల చేసింది. సరికొత్త అవతారంలో వచ్చిన థార్‌ రాక్స్ మరింత క్రేజ్‌ని పెంచుకుంది. ప్రస్తుతం దీని వెయిటింగ్ పీరియడ్‌ ఏడాదిన్నర కంటే ఎక్కువగా ఉంది. మహీంద్రా థార్‌ రాక్స్‌ ప్రారంభ రూ. 12.99 లక్షల (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది.

మారుతి సుజుకి డిజైర్: భారతీయ మార్కెట్‌లో టాక్సీ ప్లేయర్స్‌, ఫ్యామిలీలు ఎక్కువగా ఇష్టపడే కారు ఇది. దీని 4th జనరేషన్‌ వెర్షన్‌ని మారుతి సుజుకి నవంబర్‌లో విడుదల చేసింది. ఇది మారుతి సుజుకి కార్లలోనే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందిన తొలి కారుగా అవతరించింది. ఈ రేటింగ్‌తో దీని సేల్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర కేవలం రూ. 6.79 (ఎక్స్‌షోరూమ్‌) కావడం గమనార్హం.

2024 Maruti Suzuki Dzire

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, December 19, 2024, 7:20 [IST]
English summary
2024 best car launches mahindra thar roxx to new maruti suzuki dzire
Read more on: #year ender 2024 #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+