రూ.6 లక్షల ధరలో 27 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ కార్లు ఇవే భయ్యా.. ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్ అంటే ఈ తోపులే..
ప్రస్తుతం ఇంట్లో కారు ఉండటం ఒక సోషల్ స్టేటస్‌గా భావిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో కార్ల వాడకం విపరీతంగా పెరిగింది. రోడ్లపై బైకులతో పాటు ఇవి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే చాలా మంది కారు కొనే విషయంలో ఎలాంటి మోడల్‌ను ఎంపిక చేసుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. హ్యాచ్‌బ్యాక్‌లు(hatchbacks), సెడాన్‌లు(sedans), ఎమ్‌పీవీలు(MPVs), ఎస్‌యూవీలలో(SUV) తమ కుటుంబాలకు ఏది సరిపోతుందో తెలియక ఎలాంటి కారు కొనాలా అనే సంసిగ్ధంలో పడిపోతుంటారు. అయితే వారి కోసం హ్యుందాయ్ ఆరా(Hyundai Aura), మారుతీ సుజుకీ సియాజ్(Maruti Suzuki Ciaz), టాటా టిగోర్ సెడాన్‌లు(Tata Tigor sedans) బెస్ట్ ఆప్షన్‌లుగా ఉన్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..
మారుతీ సుజుకీ సియాజ్: ఈ కారు గురించి మాట్లాడుకుంటే, ఇది కూడా ప్రముఖ సెడాన్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.40 నుంచి రూ.12.29 లక్షలుగా ఉంది. డిజైన్ చాలా అందంగా ఉంటుంది. కారు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా మైలేజ్ పరంగా పెట్టిన ప్రతి రూపాయికి రెండింతలు లాభాన్ని చేకురుస్తుంది. ఇది దాదాపు 20.04 నుండి 20.65 kmpl వరకు మైలేజీని ఇస్తుంది.

ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 105 PS హార్స్ పవర్, 138 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్/4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లోపల క్యాబిన్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. ప్రధానంగా ప్రయాణీకుల రక్షణ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
హ్యుందాయ్ ఆరా సెడాన్: ఈ కారు కూడా తక్కువ ధరలో లభించే జాబితాలో ఉంటుంది. దీనిలో 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. ఇది 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో అందుబాటులో ఉంది. ప్రారంభ ధర వేరియంట్‌ను బట్టి రూ.6.49 నుండి రూ.9.05 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఎత్తు పల్లాలు ఉన్న రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది.

ఈ హ్యుందాయ్ ఆరా సెడాన్ మధ్య తరగతి వారికి బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఇది 17 నుండి 28.4 kmpl మైలేజీని అందిస్తుంది. కారులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. చిన్న కుటుంబానికి సరిగ్గా సెట్ అవుతుంది. క్యాబిన్‌లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్)ని పొందుతుంది.
టాటా టిగోర్ సెడాన్: ఈ కారు రూ.6 నుండి రూ.9.40 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. మైలేజ్ కూడా ఎక్కువగానే వస్తుంది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, ఈ టిగోర్ 19.28 నుండి 27 kmpl మైలేజీని ఇస్తుంది.

చిన్న కుటుంబం గల వారికి ఈ కారు బాగా సరిపోతుంది. దీనిలో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. లోపల క్యాబిన్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణికుల భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉన్నాయి. ఇది అన్ని రకాల రోడ్లపై సాఫీగా వెళ్తుంది.


Click it and Unblock the Notifications








