అస్సలు ఊహించని ధరలో వచ్చేసిన బీవైడీ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. ఇక ఈ కారు షోరూమ్‌ల వద్ద కూడా జనాలు క్యూ కడతారు

2024 బీవైడీ అటో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆ సంస్థ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ కారుని భారీ ధర తగ్గింపుతో సహా అనేక అప్‌డేట్స్‌తో బీవైడీ మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఈ 2024 బీవైడీ అటో 3 శ్రేణి ఇప్పుడు కేవలం రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌ల ధరల కంటే రూ .9 లక్షలు చౌకగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ 2024 మోడల్ మరింత సరసమైనదిగా ఉంది. ఇది డైనమిక్, ప్రీమియం మరియు సుపీరియర్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

2024 బీవైడీ అటో 3 ఇప్పుడు కొత్త ఎంట్రీ లెవల్ డైనమిక్‌లో చిన్న బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఈ ఎంట్రీ లెవల్‌ ట్రిమ్‌ అటో 3 49.92 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించి 468 కిలోమీటర్ల (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) రేంజ్‌ని అందిస్తుంది. ఉపయోగిస్తుంది, సుపీరియర్ వేరియంట్‌ 521 కిలోమీటర్ల (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) రేంజ్‌ని అందిస్తుంది. ఇందులో 60.48 కిలోవాట్ల బ్యాటరీని వినియోగించారు.

2024 BYD Atto 3 Launched in India

సుపీరియర్ వేరియంట్‌తో పోలిస్తే కొత్త బేస్ వేరియంట్ పై భారీగా ధర తగ్గింది. టాప్ వేరియంట్‌తో పోలిస్తే అటో 3 డైనమిక్‌లో యాంబియంట్ లైటింగ్, లెవల్ 2 ఏడీఏఎస్, ఎలక్ట్రికల్‌గా ఆపరేబుల్ టెయిల్‌గేట్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మిడ్ లెవల్ ప్రీమియం వేరియంట్‌లో మరియు అడాప్టివ్ హెడ్ లైట్లు ఉన్నాయి. టాప్ సుపీరియర్ వేరియంట్ అన్ని బెల్స్ మరియు విజిల్స్‌ని అందిస్తూనే ఉంది.

అప్‌డేటెడ్‌ అటో 3 ఇప్పుడు కాస్మోస్ బ్లాక్ ఎడిషన్‌లో ఆల్-బ్లాక్ పెయింట్ స్కీమ్‌లోనూ లభిస్తుంది. అయితే ఈ ఎస్‌యూవీ టెయిల్‌గేట్‌ుై ఉండే 'బైవైడీ' బ్యాడ్జ్‌ 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' లభించదు. సేఫ్టీ పరంగా ఈ కార్లలో ఏడు ఎయిర్ బ్యాగులు, పనోరమిక్ సన్ రూఫ్, 360 డిగ్రీల హోలోగ్రాఫిక్ ఇమేజింగ్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

BYD-Atto-3

ఇప్పటి వరకు ఈ మోడల్‌లో అందించే 12.8 ఇంచెస్‌ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అప్డేట్ చేసిన మోడల్‌లో 15.6 ఇంచెస్‌ పెద్ద యూనిట్‌ని అందించారు. దేశంలోని ఎలక్ట్రిక్ వాహన ల్యాండ్ స్కేప్‌లో ఇదొక కీలక ఘట్టమని ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ (EPV) బీవైడీ ఇండియా బిజినెస్‌ హెడ్ రాజీవ్ చౌహాన్ తెలిపారు. డైనమిక్, ప్రీమియం మరియు సుపీరియర్ బీవైడీ లైనప్‌లను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు.

మా వైవిధ్యభరితమైన ఆఫర్లు మా ఉత్పత్తి పోర్ట్‌పోలియోను విస్తరించడమే కాకుండా మరింత సమ్మిళిత ఈవీ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీని విస్తృత స్థాయి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్ల విడుదలతో మా విజిన్‌ని సాకారం చేయడానికి ఒక అడుగు దగ్గరగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

20240-BYD-Atto-Features

2024 బీవైడీ అటో 3 అన్ని వేరియంట్లలో 201 bhp (150 కిలోవాట్) మరియు 310 గరిష్ట గరిష్ట టార్క్‌ని విడుదల చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌ని కలిగి ఉంది. పూర్తి అప్‌గ్రేడ్స్‌తో వచ్చిన ఈ అటో 3 అన్ని వేరియంట్లలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌ ఉంది. దీంతో కేవలం 50 నిమిషాల్లో బ్యాటరీని 0-80 శాతం ఛార్జ్ చేయగలదు.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్‌పై దిగుమతి పరిమితులను తొలగిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో ఏఆర్ఏఐ నుంచి హోమోలాగేషన్ సర్టిఫికేట్‌ని పొందింది. దీంతో రానున్న ఈ విస్తృత శ్రేణి కార్లలో అందుబాటులో ఉన్న వేరియంట్లతో బీవైడీ కార్లకు భారీ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దేశంలో ఇప్పుడిప్పుడే ఈ కారు భారతీయ మార్కెట్‌లో దూసుకెళ్తుంది. పూర్తి స్థాయిలో ఆపరేషన్స్‌కి కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

ఈ అటో 3 ప్రధానంగా ఈ సెగ్మెంట్‌లోని MG ZS EVతో పోటీపడుతుంది. అంతే కాకుండా హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా హారియర్ ఈవీ, మహీంద్రా XUV.e8 మరియు మరెన్నో కార్లకు 2025లో పలు సవాళ్లను విసురనుంది. ఇప్పటివరకు ఈ బీవైడీకి 23 నగరాల్లో 26 అవుట్లెట్స్‌ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మరిన్ని షోరూమ్‌లను ప్రారంభించాలని భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 10, 2024, 15:20 [IST]
English summary
2024 byd atto 3 launched in india with a massive price cut full details in telugu
Read more on: #byd #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+