తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు, సేఫ్టీ అందించే కారు కావాలా? అయితే మీ కోసమే వచ్చిన కొత్త మోడల్ ఇదే

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్(Citroen) ఇండియాలో తన మార్కెట్ వాటాను పెంచుకోడానికి కొత్త మోడల్ కారును విడుదల చేసింది. దీని పేరు 'సిట్రోయెన్ బసాల్ట్(Citroen Basalt)' ఈ ఎస్‌యూవీ(SUV)కూపేను మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ లాంచ్ చేసింది. ధర కూడా చాలా తక్కువగా ఉంది. లాంచ్ సందర్భంగా ప్రారంభ ధర రూ.7.99 లక్షలతో విడుదల అయింది. వేరియంట్‌ను బట్టి ధర రూ.13.83 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. సిట్రోయెన్ కంపెనీ ఇండియాలో ఇప్పటి వరకు నాలుగు మోడళ్లను విక్రయిస్తుండగా, ఇప్పుడు విడుదల అయిన కారు ఐదో మోడల్‌గా నిలవనుంది.

ప్రస్తుత కాలంలో కారును కలిగి ఉండటం మధ్యతరగతి ప్రజల కోరిక. అయితే వారు బడ్జెట్ ధరలోనే అధునాతన ఫీచర్లతో వచ్చే కారును కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి ఈ కారు బాగా సరిపోతుంది. ఈ కారు డిజైన్, ఇతర ఫీచర్లను క్రింది కథనంలో చూద్దాం.

2024 Citroen Basalt Launch And Top Specifications

డిజైన్: సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీ డిజైన్ సరికొత్తగా ఉంటుంది. ముందు నుంచి చాలా సైలీష్‌గా ఉంది. ఇది కూపే బాడీతో వస్తుంది. ముఖ్యంగా కారు ముందు భాగంలో LED DRLలు, LED హెడ్ లైట్ సెటప్ ఇతక మోడళ్ల కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంకా, పియానో ​​బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. కారు డోర్లు చాలా వెడల్పుగా ఉంటాయి. లోపల ఇంటీరియర్ డిజైన్ సైతం చాలా అందంగా ఉంది.

ముఖ్యంగా 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఆకర్షణగా ఉంటాయి. చుట్టూ బాడీ క్లాడింగ్‌ను పొందుతుంది. సైడ్ మిర్రర్‌లకు గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ మోడల్‌లో వాలుగా ఉన్న రూఫ్‌లైన్, ర్యాపరౌండ్ 3D టెయిల్‌లైట్‌లను కూడా చూడవచ్చు. కారు వెనుక భాగంలో, షార్క్‌ఫిన్ యాంటెన్నా, డీఫాగర్‌ను కూడా అమర్చారు.

2024 Citroen Basalt Launch

లోపల, బ్లాక్, గ్రే ఫ్యాబ్రిక్ సీట్ అప్హోల్స్టరీతో పాటు డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్ థీమ్‌ ఉంది. ట్రిపుల్-టోన్ డాష్‌బోర్డ్‌, 7-అంగుళాల TFT డిస్‌ప్లే ఉన్నాయి. ప్రధానంగా, డిస్‌ప్లే 3 విభిన్న థీమ్‌లను కలిగి ఉంది, డ్రైవర్ అవసరాన్ని బట్టి దీన్ని మార్చుకోవచ్చు. ఇంకా, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, 15W వైర్‌లెస్ ఛార్జర్‌, రెండు వైపులా స్టీరింగ్-మౌంటెడ్ నియంత్రణలతో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది.

ముందు, వెనుక సీట్లు రెండూ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. కొత్త అప్‌డేట్ ఏమిటంటే, వెనుక సీటులో 3-స్థాయి సర్దుబాట్లు ఉన్నాయి. దీంతో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సమయంలో ఎలాంటి అలసట అనిపించదు. చల్లదనం కోసం కారు వెనుక భాగంలో AC వెంట్లు, అదనంగా రెండు ఛార్జింగ్ సాకెట్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, సిట్రోయెన్ బసాల్ట్ మోడల్‌లో 2 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.2 పెట్రోల్ ఇంజిన్‌తో 82 bhp పవర్, 115 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 1.2 టర్బో పెట్రోల్ 3-సిలిండర్ ఇంజిన్‌తో 109 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ వేరియంట్‌లో 190Nm టార్కును, ఆటోమేటిక్ కోసం 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా మంచి ఎంపిక అవుతుంది. దీనిలో ఉన్న ఫీచర్లు అన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చాయి, మైలేజ్ కూడా ఎక్కువగానే వస్తుంది. బడ్జెట్ ధరలో ఇవన్నీ అందించడం ద్వారా కంపెనీ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. దీనికి ఈ కొత్త కారు బాగా ఉపయోగపడుతుంది.

More from DriveSpark

Article Published On: Sunday, November 3, 2024, 8:00 [IST]
English summary
2024 citroen basalt launch engine top specifications all details check here
Read more on: #citroen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+