మారుతి జిమ్నీ, మహీంద్రా థార్‌లకు పోటీగా ఫోర్స్‌ గూర్ఖా ఎస్‌యూవీ లాంచ్‌.. బుకింగ్‌లు ప్రారంభం

ప్రముఖ ఆఫ్‌ రోడర్‌ ఎస్‌యూవీ సంస్థ ఫోర్స్(Force) తాజాగా.. తన ఆఫ్‌- పోజ్‌ ఎస్‌యూవీ గూర్ఖాను అధికారికంగా లాంచ్‌ చేసింది. రూ. 16.75 లక్షల ప్రారంభ ధరతో సంస్థ విడుదల చేసింది. ఫోర్స్‌ గూర్ఖా.. 3-డోర్ మరియు 5-డోర్ అనే రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. కారు బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఫోర్స్ తన గూర్ఖా(Force Gurkha SUV Launch) SUVని ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో అప్‌డేట్ చేసి ఈరోజు అధికారికంగా 2024 గూర్ఖాగా విడుదల చేసింది. ఈ కారు గతంలో 2021లో అప్‌డేట్ అయి వచ్చింది. మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కారు లాంచ్‌తో ఆఫ్-రోడ్ కార్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Force-Gurkha-SUV-Launch

2024 ఫోర్స్‌ గూర్ఖా(Force Gurkha)లో ఎక్స్‌టీరియర్‌ పరంగా కొత్త అల్లాయ్ వీల్స్, హెడ్‌లైట్ మరియు గ్రిల్స్‌ను అమర్చింది. రెండు విభిన్న వేరియంట్లు 3- డోర్‌, 5- డోర్‌ వెర్షన్లలో విడుదలైన ఈ కారు.. కొలతలు, ఫీచర్ల పరంగా చాలా మార్పులతో వచ్చింది. మూడు-డోర్ల వెర్షన్ పొడవు 3.95 మీటర్లు కాగా మరియు ఐదు-డోర్ల వెర్షన్ పొడవు 4.3 మీటర్లుగా ఉంది.

ఫోర్స్‌ గూర్ఖా ఎస్‌యూవీ ఇంటీరియర్‌ పరంగా కూడా చాలా అప్‌డేట్లను చూడవచ్చు. ప్రధానంగా ఇది కొత్త అప్‌హోల్డరీతో పాటు పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను అందిస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, 8.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ డిస్‌ప్లే వంటి ఇతర ఫీచర్లను ఇందులో చూడవచ్చు.

Force-Gurkha-SUV-Launch

ఇంజిన్ విషయానికి వస్తే 2024 ఫోర్స్‌ గూర్ఖాలో 2.6 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 132 bhp పవర్ మరియు 320 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేయబడి ఉంటుంది.

ఫోర్స్‌ గూర్ఖా ఎస్‌యూవీలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదని కస్టమర్లు గమనించాలి. కానీ ఈ కారులో 4 వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను సంస్థ అందిస్తోంది. లాకింగ్ డిఫరెన్షియల్ మరియు షిఫ్ట్ ఆప్షనల్‌. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. 3-డోర్ మరియు 5-డోర్ గూర్ఖా ఎస్‌యూవీలు ఇంజిన్ సెటప్‌ను కలిగి ఉంటాయని కస్టమర్లు గమనించాలి.

Force-Gurkha-SUV-Launch

ఫోర్స్‌ గూర్ఖాలో వివిధ ఆఫ్‌-రోడ్‌ ఫీచర్లను సంస్థ ప్రవేశపెట్టింది. తద్వారా.. ఇది ఆన్‌-రోడ్‌ కంటే ఆఫ్‌- రోడ్‌ పరంగా డ్రైవర్లు లేదా యజమానులకు మెరుగైన ఆఫ్‌- రోడ్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఇటీవల మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌ నిర్వహించిన గూర్ఘా ఎస్‌యూవీ సమీక్షలో మేము ఈ విషయాలను గమనించాము. ఈ లింక్‌ ద్వారా మీరు కారు రివ్యూను తెలుసుకోవచ్చు.

కాగా ఇప్పటికే ఈ ఆఫ్-రోడ్ SUV సెగ్మెంట్‌లో మారుతి యొక్క జిమ్నీ మరియు మహీంద్రా థార్ సేల్స్ పరంగా దూసుకుపోతున్నాయి. కాగా మారుతి యొక్క జిమ్నీ భారత మార్కెట్లో విక్రయించబడుతున్న ఏకైక ఐదు-డోర్ల వెర్షన్ కాగా.. మహీంద్రా యొక్క థార్ ఏకైక మూడు-డోర్ల వెర్షన్‌గా ఉంది.

ఇక ఇప్పుడు ఈ రెండు కంపెనీలకు పోటీగా రెండు రకాల ఫోర్స్‌ కార్లు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. ధర విషయానికొస్తే, ఫోర్స్‌ గూర్ఘా 3-డోర్ వెర్షన్‌ రూ. 16.75 లక్షలు కాగా.. 5-డోర్ వెర్షన్‌ను రూ. 18 లక్షల ధరతో సంస్థ విడుదల చేసింది. వీటికి సంబంధించిన బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. కస్టమర్లు రూ. 25,000 చెల్లించి ఫోర్స్‌ గూర్ఖా ఎస్‌యూవీని బుక్‌ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, May 3, 2024, 11:17 [IST]
English summary
2024 force gurkha 3 door and 5 door version suvs launched in india price specs details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+