కొత్త హోండా అమేజ్‌ వర్సెస్‌ మార్కెట్‌లో టాప్ సెడాన్లు.. వీటిలో ఏదీ బెస్ట్ అంటే?

హోండా కార్స్ భారతీయ మార్కెట్‌లో గ్రిప్‌ని పెంచుకుంటున్నాయి. తాజాగా సబ్-4 మీటర్ల సెడాన్ సెగ్మెంట్‌లో నెక్ట్స్ జనరేషన్ అమేజ్‌ని హోండా విడుదల చేసింది. దీని ధరు రూ .8 లక్షల నుంచి రూ .10.90 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ఉన్నాయి. ఇది మార్కెట్‌లో నేరుగా మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది. ఈ కొత్త హోండా అమేజ్‌ని పూర్తి అప్‌గ్రేడ్స్‌తో తీసుకువచ్చింది. పైన చెప్పిన ప్రత్యర్థి కార్లకు ఈ కొత్త కారుకి మధ్య తేడాలు మీకోసం..

ఈ హోండా అమేజ్ V, VX, ZX అనే 3 వేరియంట్లలో లభిస్తుంది. ఇది మాన్యువల్, సీవీటి ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో లభిస్తుంది. . ఈ ధరలో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో లభిస్తుంది. దీని ప్రధాన ప్రత్యర్థి కారు మారుతి డిజైర్‌ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (AMT) ఆప్షన్స్‌తో వస్తుంది. మారుతి సుజుకి రెండు సీఎన్‌జీ ఎడిషన్‌లో కూడా వస్తాయి.

New Honda Amaze

కొత్త తరం హోండా అమేజ్ డిజైర్ కంటే దాదాపు రూ . 1.20 లక్షలు ఖరీదైనదిగా ఉంది. అయితే అమేజ్‌లో అధునాతన సేఫ్టీ, సౌలభ్యం కోసం మంచి ఫీచర్లను అందించారు. దీనివల్ల ధరల్లో వ్యత్యాసం పెరిగింది. అమేజ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ & ట్రాక్షన్ కంట్రోల్, ఇతర సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

అమేజ్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కోసం వైర్‌లైస్‌ కనెక్టివిటీని స్టాండర్డ్‌గా అందించారు. డిజైర్‌లోనూ ఈ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత హ్యుందాయ్ ఆరా హోండా అమేజ్ బేస్ ఎడిషన్ కంటే రూ. 1.50 లక్షలు ఎక్కువగా ఉంటుంది. హ్యుందాయ్ ఆరా మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌ ఐదు వేరియంట్లలో లభిస్తుంది.

Honda Amaze Vs Maruti Dzire

హ్యుందాయ్‌ ఆరా ధర రూ .6.49-9.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా ఉంది. దీనిని అమేజ్, డిజైర్ కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. హ్యుందాయ్ ఆరా టాప్ వేరియంట్ SX + AMT కంటే కూడా హోండా అమేజ్‌లో టాప్-క్లాస్‌ ఫీచర్లు కలవు. హ్యుందాయా ఆరా సెడాన్‌ భారీ డిజైన్‌తో వస్తుంది. ఇది ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది.

టాటా టిగోర్ ఈ సెగ్మెంట్‌లో బెస్ట్‌ వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్‌తో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ.6 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ప్రారంభమవుతుంది. నాలుగు వేరియంట్లలో లభించే ఈ టిగోర్ మాన్యువల్, AMT ఆప్షన్స్‌తో వస్తుంది. ఇది సీఎన్‌జీ ఆప్షన్‌లోనూ లభిస్తుంది. టాప్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ అమేజ్ కంటే రూ. 2.50 లక్షలు తక్కువ.

New Gen Honda Amaze Vs Hyundai Aura

డ్రైవ్‌స్పార్క్ కాన్సెప్ట్: భారతదేశంలో సబ్-4 సెడాన్ సెగ్మెంట్‌ కస్టమర్ల అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చడానికి పైన చెప్పిన కార్లు సరిపోతాయి. న్యూ జనరేషన్‌ హోండా అమేజ్‌తో పోటీ మరింత పెరగనుంది. ప్రస్తుతం దీని రాకో పోటీ మరింత తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే ఈ కారు కూడా అధునాతన సేఫ్టీ ఫీచర్లు, కంఫర్ట్‌తో వస్తుంది. ఆశించిన స్థాయిలో రాణిస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, December 5, 2024, 19:21 [IST]
English summary
2024 honda amage vs rivals price and features comparison
Read more on: #honda #comparison #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+