25 కి.మీ మైలేజీ.. 7 మంది హాయిగా ప్రయాణించవచ్చు.. ధర కూడా తక్కువే!!

హోండా సంస్థ సరికొత్త కారుని లాంచ్ చేసింది. దీనికి ఫ్రీడ్ అనే పేరును పెట్టింది. ఇది ఒక కాంపాక్ట్ MPVగా ఉండనుంది. పెట్రోల్, హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కారు అందుబాటులో ఉంటుందని హోండా పేర్కొంది. ఈ కారు ప్రస్తుతం జపాన్‌లో మాత్రమే అమ్మకానికి ఉంది. దానికి సంబంధించిన ధరలను కూడా హోండా ప్రకటించింది. ఈ కారు జపాన్‌లో ఎయిర్ మరియు క్రాస్ స్టార్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ అధునాతన హోండా కారు త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ప్రపంచ మార్కెట్‌లోకి ఈ కారని ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని హోండా వెల్లడించలేదు. దీనిపై విడుదల, ఇతర అప్‌డేట్స్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కారు డైమెన్షన్ మునపటి కారు కంటే కొంచెం ఎక్కవగా ఉండున్నాయి. దీని పొడవు 4,310 మిమీ, వెడల్పు 1,720 మిమీ మరియు ఎత్తు 1,780 మిమీగా ఉండనుంది. దీని వీల్ బేస్ 2,740 మిమీగా ఉంది.

Honda-Freed-Price-Announced-In-Japan

ఈ కారు రెండు మోటారు ఎంపికలలో లభిస్తుంది. ఇందులో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ మోటార్ e:HEV హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్‌ని కలిగి ఉంటుంది. మొదటి ఇంజన్ 6,600 rpm వద్ద 118 ps గరిష్ట శక్తిని మరియు 4,300 rpm వద్ద 142 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది సీవీటీ గేర్ బాక్స్ ద్వారా మోటార్ ఈ శక్తిని విడుదల చేస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ మూవ్ మెంట్ ఆప్షన్‌ని ఈ మోటార్‌తో అందించనున్నారు. హైబ్రిడ్ ఫీచర్ ఫ్రీడ్ గరిష్టంగా 123 ps మరియు 253 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 2024 హోండా యెన్ ధర 2.508-3.437 మిలియన్ యెన్ల మధ్య ఉంది. భారత్‌లో దీని ధర సుమారు రూ. 13-17 లక్షలుగా ఉండనుంది.

Honda-Freed-Price-Car-In-India

ఈ ఆప్షన్ లీటరుకు 25 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మరోవైపు నాన్ హైబ్రిడ్ సిస్టమ్ లీటరుకు కేవలం 16.2 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది. మైలేజీ పరంగానే కాకుండా టెక్నికల్ ఫీచర్స్ పరంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఏఈబీ), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ఏసీసీ), లేన్ కీప్ అసిస్ట్ (ఎల్కేఏ), హోండా సెన్సింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇతర ఫీచర్లలో డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్, బిగ్‌ సెంట్రల్ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు బిగ్‌ ఏసీ వెంట్స్ ఉన్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక వేరియంట్లలో ఈ కారును అందించనున్నట్లు హోండా తెలిపింది. వీల్ చైర్ సీటును కారులోకి చొప్పించారు. కొత్త హోండా సీట్ ఆప్షన్స్‌ మరియు జపనీయులను ఆకట్టుకునే అనేక సాంకేతిక ఫీచర్లతో వస్తుంది. భారత్‌లో ఈ కారు విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Honda-Freed-Price

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, June 29, 2024, 12:46 [IST]
English summary
2024 honda freed mpv price announced in japan full details in telugu
Read more on: #honda #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+