ఫ్యామిలీ కోసం మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారు కొనాలని చూస్తున్నారా? అయితే సెప్టెంబర్‌ 9 వరకు ఆగండి!

ప్రస్తుతం ప్రతీ ఇంట్లో పెద్ద ఫ్యామిలీ కారు ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో అందరితో కలిసి సులంభంగా ప్రయాణించేలా 7 సీటర్ మోడళ్లను మాత్రమే కొనేందుకు జనాలు ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంతో పోలిస్తే ఫ్యామిలీతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌లు పెరిగాయి. ఈ సెగ్మెంట్‌లో కంపెనీలు సైతం ఎక్కువ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా బిగ్‌ ఫ్యామిలీస్‌ని టార్గెట్‌ చేస్తూ హ్యుందాయ్ అల్కజార్‌ని 7 సీటర్‌ వెర్షన్‌లో విడుదల చేయబోతుంది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ క్రెటా ఆధారంగా అల్కాజార్‌ని కంపెనీ రూపొందించింది.

మార్కెట్‌లో అమ్మకాలను మరింత పెంచుకోడానికి అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని 7 సీటర్‌లో తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో పలు మార్పులు ఉండే అవకాశం ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. విడుదలకు ముందే ఈ కారుకి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తుంది. సెప్టెంబర్ 9న ఈ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ని విడుదల చేయనుంది.

2024 Hyundai Alcazar Safety features

ఈ కారుపై అంచనాలను పెంచడానికి కంపెనీ ఇదివరకే ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ఇంజిన్ ఆప్షన్‌, డిజైన్ వివరాలను విడుదల చేసింది. ఇప్పుడు సేఫ్టీలో కూడా తమకు ప్రత్యర్థులు లేరని తెలుపుతూ దీని సేఫ్టీ ఫీచర్లను వెల్లడించింది. హ్యుందాయ్ అల్కాజార్‌ని 2021లో లాంచ్ చేసింది. విడుదల నుంచి తొలిసారిగా ఇందులో సేఫ్టీ ఫీచర్లను భారీగా అప్‌గ్రేడ్‌ చేశారు.

త్వరలో రానున్న ఈ కారులో సేఫ్టీ పరంగా దాదాపు 40కి పైగా స్టాండర్డ్‌ సేఫ్టీ ఫీచర్లను అందించనుంది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫోర్ డిస్క్ బ్రేక్స్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించారు.

2024 Hyundai Alcazar Safety features

స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ వంటి 19 ఫీచర్లు, హ్యుందాయ్ స్మార్ట్ సెన్స్ లెవల్ 2 ఏడీఏఎస్‌తో రానుంది. అంతే కాకుండా సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్యుయేషన్ వార్నింగ్ ఇంకా మరెన్నో అదనపు సేఫ్టీ ఫీచర్లను పొందుతుంది.

ఈ కొత్త హ్యుందాయ్ అల్కాజార్‌లో డిజిటల్ కీ, హిల్ డిసెంట్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్స్‌, ఎలక్ట్రోక్రోమిక్ ఇన్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లను అందిస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి అల్కాజర్ మరింత ఎక్కువ ఫీచర్లతో ఈ కారుని ఫుల్‌ప్యాక్డ్‌గా పరిచయం చేయబోతుంది.

2024 Hyundai Alcazar Safety features

దీని డిజైన్‌లో సవరించిన గ్రిల్, కనెక్టింగ్ LED లైట్ బార్‌తో హెచ్-ఆకారంలో ఉన్న LED DRLs లను అందించింది. ఫేస్‌లిఫ్టెడ్ అల్కాజార్ కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ లైట్లతో కూడా కొన్ని మార్పులు తీసుకువచ్చారు. డిజైన్‌ పరంగా చూడగానే సరికొత్తగా కనిపిస్తూ కస్టమర్లను ఆకట్టుకోనుంది.

ఇక ఈ 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఎనిమిది మోనోటోన్‌, తొమ్మిది డ్యూయల్-టోన్ కాంబినేషన్ ఆప్షన్స్‌ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే మ్యాట్, స్టార్రీ నైట్, రేంజర్ ఖాకీ, అట్లాస్ వైట్, స్ట్రాంగ్‌ ఎమరాల్డ్ పెర్ల్, స్ట్రాంగ్‌ ఎమరాల్డ్ మ్యాట్, ఫైరీ రెడ్ కలర్స్ మోనోక్రోమాటిక్ ఆప్షన్లుగా ఎంచుకునే అవకాశం వినియోగదారులకు ఉంది.

ఇక ఈ అల్కాజార్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5-లీటర్ U2 CRDi డీజిల్, 1.5-లీటర్ టర్బో GDi ఇంజిన్స్‌తో వస్తుంది. ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉంటాయి. ఈ ఎస్‌యూవీలో నార్మల్, ఎకో, స్పోర్ట్ వంటి మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్‌తో పాటు స్నో, మడ్, శాండ్, ట్రాక్షన్ మోడ్స్ ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 4, 2024, 11:07 [IST]
English summary
2024 hyundai alcazar equipped with advanced safety features check here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+