హ్యుందాయ్‌ నుంచి సరికొత్త ఫ్యామిలీ కారు లాంచ్‌.. ఇందులో రెండు ఫ్యామిలీలు హాయిగా వెళ్లవచ్చు!

హ్యుందాయ్ అల్కజార్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఎస్‌యూవీ నేడు మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ కారు 6,7 సీటర్‌ వెర్షన్‌లో అందుబాటులో ఉండనుంది. ఇందులో రెండు కుటుంబాలు సులభంగా ప్రయాణించవచ్చు. ఈ కొత్త హ్యుందాయ్ అల్కాజార్‌ పెట్రోల్ వేరియంట్‌ ధర రూ.14.99 లక్షలు.. డీజిల్‌తో నడిచే వేరియంట్ ధర రూ.15.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్‌) ఉంది.

ఈ అప్‌డేటెడ్ అల్కాజర్ ఆకర్షణీయమైన డిజైన్‌ని కలిగి ఉంది. ఎక్స్‌టీరియర్‌లో వినూత్న గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, హెచ్ ఆకారంలో LED DRLs, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ కొత్త హ్యుందాయ్ అల్కాజార్ అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్ పెర్ల్, రేంజర్ ఖాకీ, ఫియరీ రెడ్, స్టారీ నైట్, టైటాన్ గ్రే మ్యాట్ వంటి 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

2024 Hyundai Alcazar facelift Launch

ఈ కారు 4,560 మిమీ పొడవు, 1,800 మిమీ వెడల్పు, 1,710 మిమీ ఎత్తుని కలిగి ఉంది. ఇక దీని వీల్‌బేస్ 2,760 మిమీగా ఉంది. ఈ కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ 2 పవర్‌ట్రైయిన్‌ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 158 bhp పవర్, 253 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మరో 1.5-లీటర్ డీజల్ ఇంజిన్ గరిష్టంగా 113 bhp పవర్, 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు వేరియంట్లను బట్టి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీటీ (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌) గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో నార్మల్, ఎకో, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇది స్నో, మడ్, శాండ్ అనే 3 ట్రాక్షన్ మోడ్స్‌తో వస్తుంది.

2024 Hyundai Alcazar facelift Launch

దీనిలోని ఇంటీరియర్ క్యాబిన్ డిజైన్ మరింత అధునాతనమైనదిగా ఉంటుంది. అల్కాజార్ ఎస్‌యూవీలో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అండ్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, లెవల్-2 ఏడీఏఎస్ (అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. కావున మంచి ఫ్యామిలీ కోసం ఎవరైనా చూస్తుంటే ఈ కారుని కళ్లుమూసుకుని కొనుగోలు చేయవచ్చు.

ఈ హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎంజీ హెక్టర్, సిట్రోయిన్ సీ3 ఎయిర్‌క్రాస్, కియా కేరెన్స్‌కి గట్టి పోటీని ఇస్తుంది. మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర మూడేళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA)తో సహా కాంప్రెహెన్సీవ్‌ వారంటీ ప్యాకేజీని అందిస్తుంది.

2024 Hyundai Alcazar facelift Launch

అంతే కాకుండా కస్టమర్లు ఐదేళ్ల వరకు ట్రస్ట్ రన్నింగ్ రిపేర్ ప్యాకేజీ లేదా సూపర్ పీరియాడిక్ మెయింటెనెన్స్ ప్యాకేజీతో పాటు ఏడేళ్ల వరకు పొడిగించిన వారంటీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇలా ఈ కారుని కొనుగోలు చేసిన ఏడేళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రైవ్‌ చేసుకోవచ్చు. ఈ కారు పెద్ద ఫ్యామిలీలకు సరిపోతుంది. కావున ఫ్యామిలీల కోసం కారుని కొనాలని చూస్తుంటే దీనిపై కూడా ఓ లుక్కేయండి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 9, 2024, 19:00 [IST]
English summary
2024 hyundai alcazar facelift launched in india at rs 14 99 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+