భారత్‌లో 2024 హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు టెస్ట్ డ్రైవ్.. సింగిల్ ఛార్జింగ్‌తో 450 కి.మీ రేంజ్??
ఎలక్ట్రిక్ కార్లకు భారత్ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా అనేక కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వినియోగదారుల ఆసక్తి, అవసరాలకు అనుగుణంగా మరిన్ని కార్లను లాంచ్ చేసేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai New EV Testing) భారత్‌లో హ్యుందాయ్ కోనా EV, హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఈవీలను ప్రస్తుతం విక్రయిస్తోంది. భారత్ మార్కెట్‌లో కోనా ఈవీ ప్రారంభ ధర రూ.23.84 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. హై ఎండ్ మోడల్ రూ.24.03 లక్షలుగా (ఎక్స్‌షోరూం) గా ఉంది.

భారత్ మార్కెట్‌లో హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఒకే వేరియంట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. కారు ధర రూ.45.95 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఈ రెండు కార్ల ధర ఎక్కువగా ఉందని భావిస్తున్న సంస్థ మరింత తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయాలని నిర్ణయించింది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును ఇతర దేశాల్లో టెస్ట్ డ్రైవ్ చేసింది. అయితే అవి ప్రీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లుగా ఉన్నాయి.
అయితే తాజాగా హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఆధారంగా రూపొందిన ఎలక్ట్రిక్ కారును భారత్‌లో తొలిసారిగా (Hyundai Creta 2024 EV) టెస్ట్ ట్రైవ్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ వెర్షన్ ICE వేరియంట్లు అందుబాటులో వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ కారును 2024 చివరలో లేదా 2025 సంవత్సరంలో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ EV 45kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ బ్యాటరీని సింగిల్ ఛార్జింగ్ చేయడం ద్వారా 450 కి.మీ పైగా రేంజ్ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ హ్యుందాయ్ కొత్త ఈవీ ప్రారంభ ధర సుమారుగా రూ.17 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 2024 ను హ్యుందాయ్ మోటార్స్ రూ.11 లక్షల (ఎక్స్‌షోరూం) ప్రారంభ ధరలో విడుదల చేసింది. ఇంటీరియర్‌లో డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ 10.25 అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ కోసం అందించారు. దీంతోపాటు క్లైమెట్ కంట్రోల్ ప్యానల్, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ టోన్ AC సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 2024 ఫీచర్లు : దీంతోపాటు పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. భద్రత పరంగా ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








