2024 Hyundai Creta Facelift Review Video హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ పర్మామెన్స్ రివ్యూ వీడియో
భారత్ మార్కెట్‌లోకి ఇటీవల హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల అయింది. గతమోడల్‌తో పోలిస్తే అనేక మార్పులను కలిగి ఉంది. క్యాబిన్‌లో ఎక్కువ మార్పులను గమనించవచ్చు. దాంతోపాటు ఇంజిన్, పనితీరులోనూ మార్పులున్నాయి. ఈ ఎస్‌యూవీ సమీక్ష కోసం జోద్‌పూర్‌కు రావాలని మా డ్రైవ్‌స్పార్క్ బృందానికి ఆహ్వానం అందింది. పూర్తి రివ్యూ వీడియో ఈ కథనంలో..
క్రెటా ఫేస్‌లిఫ్ట్ SUV మరింత మెరుగైన లుక్‌ను కలిగి ఉంది. పాత మోడల్ కంటే ఆకర్షణీయంగా ఉంది. మరియు చతురస్రాకార డిజైన్‌తో వచ్చింది. వెనుకవైపున కూడా కనెక్టెడ్ టెయిల్‌లైట్‌లు ముందువైపున ఉన్నట్లుగానే LED DRL సెటప్‌ను కలిగి ఉంటాయి. ముందు భాగం కంటే ఎక్కువ క్లాడింగ్‌ను కలిగి ఉంటాయి.
హ్యుందాయ్ క్రెటా వెనుకవైపు ఉన్న నంబర్ ప్లేట్‌కు ఇరువైపులా క్రెటా, వేరియంట్ బ్యాడ్జ్‌లు అమరి ఉన్నాయి. మరియు రిజిస్ట్రేషన్ ప్లేట్‌కు పైన హ్యుందాయ్ బ్యాడ్జ్ ఉంటుంది. వెనుక బంపర్ మధ్యన రివర్సింగ్ లైట్ అమర్చబడింది. అయితే కెటా 2024 వెర్షన్ ఇంటీరియర్‌లో అనేక మార్పులను గమనించవచ్చు.

డ్యాష్‌బోర్డ్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే అన్ని కనెక్టివిటీ కంట్రోల్‌లను కలిగి ఉంటుంది. బోస్ ప్రీమియం ఆడియో సెటప్‌తో వస్తుంది. అయితే భారతీయ భాషల్లో ఉన్న కమాండ్‌లు సరిగ్గా పనిచేయలేదు. డ్యూయల్ జోన్ AC వెంట్‌లు కలిగి ఉంది. ఫిజికల్ డయల్ మరియు బటన్ల ద్వారా కూడా నియంత్రించవచ్చు.


Click it and Unblock the Notifications








