హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ధరల పెంపు.. ఏ వేరియంట్‌పై ఎంత పెంచిందంటే.??

భారత మార్కెట్లో హ్యుందాయ్ మోటార్స్‌(Hyundai Motors) తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ క్రెటా ధరలను పెంచింది. ఈ మేరకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో సవరించిన ధరలను వెల్లడించింది. కాగా హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఈ ఏడాది జనవరిలో కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కథనంలో పెంచిన క్రెటా ధరల వివరాలను అందిస్తున్నాం.

దేశంలో హ్యుందాయ్‌ మోటార్స్‌ నుంచి క్రెటా మోడల్‌(Hyundai Creta Price Hike)కు విపరీతమైన ప్రజాదరణ ఉంది. దీని స్పోర్టీ లుక్‌, అద్భుతమైన పనితీరు కారణంగా కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో జనవరిలో భారీ అంచనాల నడుమ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను సంస్థ లాంచ్‌ చేసింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఊహించని రీతిలో బుకింగ్‌లను సొంతం చేసుకుంది.

Hyundai-Creta-2024-Price-Hike

ఈ క్రమంలో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కావడంతో ప్రముఖ ఆటో మేకర్లు కార్ల ధరలను పెంచాయి. తాజాగా ఈ కోవలోకి హ్యుందాయ్‌ కూడా చేరింది. హ్యుందాయ్‌ తన బెస్ట్‌ సెల్లింగ్‌ ఎస్‌యూవీ క్రెటా(2024 Creta Price Hike) ధరలను సవరించింది. క్రెటా 2024 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రారంభ ధర రూ .11 లక్షలు (ఎక్స్-షోరూమ్) గానే ఉంచింది. కానీ క్రెటాలో ఇతర వేరియంట్ల ధరలను స్వల్పంగా పెంచింది.

ఇటీవలే తన మొదటి క్రెటా N లైన్ వెర్ష్‌ను హ్యుందాయ్‌ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఎస్‌యూవీ మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీగా కొనసాగుతోంది. కాగా లాంచ్‌ సమయంలో హ్యుందాయ్ క్రెటాను రూ.11 లక్షల ప్రారంభ ధరను ప్రకటించగా.. టాప్-ఎండ్ వెర్షన్ ధర రూ .20 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది.

Hyundai-Creta-2024-Price-Hike

ఇప్పుడు క్రెటా లైనప్ (Hyundai Creta) లోని పెట్రోల్ వెర్షన్‌లో, హ్యుందాయ్ 1.5-లీటర్ ఇంజిన్, మాన్యువల్ గేర్ బాక్స్‌తో వచ్చే ఎంట్రీ లెవెల్ E వేరియంట్ ధర, DCT ట్రాన్స్‌మిషన్ 1.5-లీటర్ టర్బో యూనిట్‌తో వచ్చిన SX(O) వేరియంట్ ధరలో సంస్థ ఏ మార్పులు చేయలేదు. అయితే పెట్రోల్ ఇంజిన్ ఉన్న మిగతా వేరియంట్ల ధరలను మాత్రం స్వల్పంగా పెంచింది. ఈ ధర పెంపు రూ.3,500 గా ఉంది.

Hyundai-Creta-2024-Price-Hike

ఇక హ్యుందాయ్‌ క్రెటా డీజిల్ వేరియంట్లలో, ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో కూడిన SX (O) మరియు SX (O) డ్యూయల్ టోన్ వంటి టాప్-ఎండ్ వేరియంట్ల ధరలను హ్యుందాయ్‌ అలాగే ఉంచింది. 1.5-లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ ఉన్న ఇతర అన్ని వేరియంట్ల ధరలను సుమారు రూ.10,800 పెంచినట్లు సంస్థ ప్రకటించింది.

కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌.. దాని మునుపటి వెర్షన్‌తో పోలిస్తే అనేక మార్పులను కలిగి ఉంది. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌, డిజైన్‌ అండ్‌ లుక్‌ పరంగా అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇందులో లెవల్ 2 ADAS టెక్నాలజీ, కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఆప్షన్‌ను సంస్థ తీసుకువచ్చింది.

Hyundai-Creta-2024-Price-Hike

డిజైన్‌ పరంగా క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ 2024 లో కొత్త గ్రిల్, కొత్త LED DRL, హెడ్ లైట్ సెటప్, ముందు భాగంలో కొత్త బంపర్, రీ డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ టెయిల్ లైట్లు, వెనుక భాగంలో ట్వీక్డ్ బంపర్‌తో ఆకర్షణీయంగా సంస్థ రూపొందించింది. క్యాబిన్‌ను కొత్త కలర్ స్కీమ్‌తో, అప్ హోల్స్టరీతో అద్భుతంగా రూపొందించింది.

Hyundai-Creta-2024-Price-Hike

కొత్త హ్యుందాయ్‌ క్రెటాలో కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, డ్యూయల్ స్క్రీన్ సెటప్, ఆధునిక ఎయిర్ కండిషన్ వెంట్స్‌ ఫీచర్లతో పాటు మరిన్ని సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, లీడ్ కార్ డిపార్చర్ అలర్ట్, బ్లైండ్ వ్యూ మానిటర్, లెవెల్‌ 2 ADAS ఇలా దాదాపు 70 సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 4, 2024, 18:35 [IST]
English summary
2024 hyundai creta prices hike on several variants check out the revised list here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+