ఆధునిక హంగులతో లాంచ్ అయిన 2024 ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్.. పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఇసుజు.. 'డీ-మ్యాక్స్ వీ క్రాస్' లైనప్‌ను అప్డేటెడ్ రూపంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ మోడల్స్ ప్రైస్, డిజైన్ వంటి వివరాలను గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుందాం.

మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ ఇసుజు డీ మ్యాక్స్ వీ క్రాస్ హై-ల్యాండర్, వీ-క్రాస్ జెడ్ మరియు వీ-క్రాస్ జెడ్ ప్రెస్టీజ్. వరుసగా రూ. 21.20 లక్షలు, రూ. 25.52 లక్షలు మరియు రూ. 26.92 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, చెన్నై). కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడమ్ ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇవన్నీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి.

2024 Isuzu D Max V Cross

ఇండియన్ మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ వీ-క్రాస్ మోడల్స్‌లో టాప్ వేరియంట్ జెడ్ ప్రెస్టీజ్.. రీడిజైన్ చేయబడిన గ్రిల్, బ్లాక్ అవుట్ వీల్స్, ఇంజిన్ హుడ్ గార్నిష్, ఫ్రంట్ బంపర్ గార్డ్ వంటి అనేక అప్డేట్స్ పొందుతుంది. అంతే కాకుండా ఫాగ్ లైట్లు, ఫెండర్ లిప్, ఫ్రంట్ అండ్ రియర్ వీల్ ఆర్చ్‌లు, రియర్ బంపర్, ఓఆర్వీఎమ్ మరియు రూఫ్ రైల్స్ అన్నీ కూడా ముదురు బూడిద రంగులో ఉంటాయి.

ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. మూడు వేరియంట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. రియర్ బెంచ్ సీటు కొత్తగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్, హిల్ డీసెంట్ వంటివన్నీ ప్రామాణికంగా లభిస్తాయి. ఇందులో మూడు త్రీ పాయింట్ సీట్ బెల్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ వావన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

2024 Isuzu D Max V Cross Front Profile

ఇసుజు డీ-మ్యాక్స్ వీ క్రాస్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. అంతే కాకుండా ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టం, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం మొదలైనవి ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ సమయంలో వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

అప్డేటెడ్ ఇసుజు డీ మ్యాక్స్ వీ క్రాస్ లైనప్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.9 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 163 Bhp పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. ఇది ఫోర్-వీల్ మరియు రియర్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది.

2024 Isuzu D Max V Cross Seat

దేశీయ మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ ఇసుజు డీ మ్యాక్స్ వీ క్రాస్ లైనప్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న టయోటా హైలక్స్ పికప్ ట్రక్కుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ టయోటా హైలెక్స్ ధరలు అధికంగా ఉండటం వల్ల.. ఇసుజు అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేయడం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, May 3, 2024, 11:10 [IST]
English summary
2024 isuzu d max v cross range launched in india price and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+