2024 Kia Carnival Launch కియా నుంచి కొత్త కారు విడుదల.. 7 సీటర్, 8 ఎయిర్‌బ్యాగ్స్ ఇంకా మరెన్నో ఫీచర్లు!
న్యూ జనరేషన్ కియా కార్నివాల్ ఎంపీవీ (New-Gen Kia Carnival) నేడు మార్కెట్‌లో విడదుల అయ్యింది. నేడు (అక్టోబర్ 03)న న్యూఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ కారుని సంస్థ దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఈ ఫ్యామిలీ కారు ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనిని రూ .63.90 లక్షలు, (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) ధరతో కియా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ కియా కారుపై మేము ఇదివరకే తెలియజేసిన విధంగా ఇది లిమోసిన్ (Limousine), లిమోసిన్ ప్లస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
పాత కియా కార్నివల్‌తో పోలిస్తే ఈ కొత్త జనరేషన్ ఎంపీవీ ఎక్స్‌టీరయర్ డిజైన్‌లో అనేక మార్పులతో వస్తుంది. ఇందులో కొన్ని మార్పులను కియా చేసింది. ముఖ్యంగా కొత్త గ్రిల్, ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్స్, 'L' ఆకృతిని పోలిన DRLs, టెయిల్‌గేట్ వద్ద LED లైట్‌బార్, డిఫరెంట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది షార్క్‌ఫిన్ యాంటెనాతో కూడా లభిస్తుంది.

ఈ కియా కార్నివాల్ ఎంపీవీ శక్తివంతమైన పవర్‌ట్రైన్ ఆప్షన్‌ని కలిగి ఉంటుంది. ఇందులోని 2.2-లీటర్ 4 సిలిండర్ స్మార్ట్‌స్ట్రీమ్ E-VGT CRDi డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. కియా కార్నివల్‌లో ఈ ఇంజిన్‌ని గత ఏడాది ఏప్రిల్ లోనే కంపెనీ నిలిపివేసింది. తాజాగా మళ్లీ తీసుకువచ్చింది. 197 bhp పవర్, 440 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
ఈ కొత్త కారులో 7 మంది వరకు హాయిగా కూర్చొని సుదూర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. ఇందులోని టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (12.3 అంగుళాలు), డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే (12.3 అంగుళాలు), ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ సింగిల్-పేన్ సన్‌రూఫ్, 12-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ కియా కార్నివాల్ ఎంపీవీ ప్రయాణీకులకు మంచి సేఫ్టీని అందిస్తుంది. సేఫ్టీ పరంగా ఇందులో 8-ఎయిర్‌బ్యాగ్స్, ABS (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), లెవల్ -2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360 డిగ్రీల కెమెరా వంటివి ఉన్నాయి.
ఈ కియా కారు భారీ ఆకృతిలో వస్తుంది. ఇది 5155 మిమీ పొడవు, 1955 మిమీ వెడల్పు, 1755 మిమీ ఎత్తు, 3090 మిమీ వీల్‌బేస్‌ని కలిగి ఉంటుంది. ఇందులోని మూడు వరుసల సీట్లు ప్రయాణీకులకు కంఫర్ట్‌ని అందిస్తాయి. ఎక్కువ స్పేస్‌తో దీని ఇంటీరియర్ మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఇందులో రెండు చిన్న కుటుంబాలు హాయిగా ప్రయాణించవచ్చు.

ఈ కొత్త తరం కియా కార్నివాల్ ఇప్పటికే 2,796 మంది కస్టమర్లు బుక్ చేసుకున్నారు. వీటి డెలివరీలు కూడా అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అయితే దీని ధర చాలా ఎక్కువగా ఉంది. ధర ఎక్కువే ఉన్న కానీ ఇందులో పెద్ద ఫ్యామిలీలు సులభంగా వెళ్లవచ్చు. ఇక రాబోయే రోజుల్లో కొత్త కార్నివాల్ ఎంపీవీ దేశీయ వినియోగదారుల నుంచి ఎలాంటి డిమాండ్‌ని పొందుతుందో చూడాలి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








