24 గంటల్లో 1822 బుకింగ్స్.. ఆ కారు విడుదల కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న జనాలు!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన పాపులర్ కియా కార్నివాల్ (Kia Carnival)ను అప్‌డేట్ చేసి లాంచ్ చేయనుంది. ఈ కొత్త తరం కియా కార్నివాల్‌ని అక్టోబర్ 3, 2024 న భారత్‌లో ఆ సంస్థ అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ సరికొత్త కారుతో పాటు కియా తన కొత్త ఈవీ9 ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కొత్త కియా కార్నివాల్‌ని 2023 ఆటో ఎక్స్‌పోలో KA4 కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శించారు. అప్పటి నుంచి ఈ కారుపై అంచనాలు అమాంత పెరిగిపోయాయి. తాజాగా ఈ కారుకి సంబంధించిన బుకింగ్స్‌ని సంస్థ ప్రారంభించింది. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
ఈ సరికొత్త లగ్జరీ ఎంపీవీ కారును బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 2 లక్షల టోకెన్ అమౌంట్ చెల్లించి పొందవచ్చు. అయితే ఈ కారు బుకింగ్స్ ప్రారంభించినప్పటీ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బుకింగ్స్ ఆరంభించిన రోజే ఈ ప్రీమియం ఎంపీవీ 1,822 ప్రీ-బుకింగ్స్‌ని అందుకుంది. ఈ కొత్త కియా కార్నివాల్ భారీ అప్‌డేట్స్‌తో భారత మార్కెట్లోకి వస్తుండటంతో జనాల్లో అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సరికొత్త ఎంపీవీ టయోటా ఇన్నోవా క్రిస్టా టాప్-ఎండ్ వేరియంట్స్‌తో నేరుగా పోటీ పడుతుంది. ఈ కొత్త కియా కార్నివాల్‌ని కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) ద్వారా భారతదేశానికి తీసుకురానున్నారు. కావున దీని ధర ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ తాజా కార్నివాల్ లిమోసిన్ (Limousine), లిమోసిన్ ప్లస్ అనే వేరియంట్లలో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
లిమోసిన్: ఈ వేరియంట్ కియా కార్నివాల్‌లో 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, టైగర్ నోస్ గ్రిల్, ఆటో ఫంక్షన్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్, LED DRLs, రియర్ స్పాయిలర్ విత్ LED, 2 సింగిల్ పేన్ సన్‌రూఫ్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ యాక్సెంట్స్ వంటి వాటితో వస్తుంది.

ఇక దీని ఇంటీరియర్‌లో 4-వే హై సపోర్ట్‌తో 12-వే డ్రైవింగ్ డ్రైవర్ సీటు, 8-వే అడ్జస్టబుల్ సీటు, రిక్లైనింగ్ ఫంక్షన్‌తో రెండవ వరుసలో స్లైడింగ్ కెప్టెన్ సీట్లు, మూడవ వరుసలో 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ సీట్లు, సన్ బ్లైండ్స్, బ్రైట్ గ్లోవ్ బాక్స్, 64-కలర్ సరౌండ్ లైట్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి.
కార్నివాల్ లిమోసిన్ వేరియంట్లో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్, డ్రైవింగ్ మోడ్లు, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్, IRVM, ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి.
లిమోసిన్ ప్లస్: లిమోసిన్ కారు ముందు, వెనుక మ్యాట్ క్రోమ్ స్కిడ్ ప్లేట్లు, ఎల్ఈడీ రియర్ ఫాగ్ ల్యాంప్స్, ప్యాడిల్ ల్యాంప్స్, స్మార్ట్ పవర్డ్ టెయిల్ గేట్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. లిమోసిన్ ప్లస్ కూడా లిమోసిన్ వేరియంట్‌లో ఉండే ఫీచర్లతో వస్తుంది. ఇందులో లెవల్ 2 ADASతో సహా టాప్-ఎండ్ వేరియంట్ మసాజ్ ఫంక్షన్లతో కూడిన వెంటిలేటెడ్ రెండవ వరుస సీట్లతో మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.
ఇందులో లెగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 11 అంగుళాల అడ్వాన్స్‌డ్ హెడ్స్ అప్ డిస్ ప్లే, వైర్ లెస్ ఛార్జర్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 12 స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో కలవు. లిమోసిన్ ప్లస్ వేరియంట్ మరింత ప్రీమియం లుక్‌ని కలిగిన టాన్ ఇంటీరియర్‌తో వస్తుంది. ఈ కియా కార్నివాల్‌ని 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications








