32 కి.మీ మైలేజీ ఇచ్చే మారుతి కారు కొత్త హంగులతో నవంబర్‌ 11న వచ్చేస్తుంది.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!

దేశంలో కార్ల తయారీ, అమ్మకాల్లో భారీగా పేరున్న కంపెనీగా మారుతి సుజుకి ఉంది. ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లు దేశంలో అన్ని విభాగాల్లో మంచి సేల్స్‌తో దుమ్మురేపుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా దేశీయ కార్ల తయారీలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఏకచత్రాధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. తాజాగా ఈ కంపెనీ సరికొత్త అదిరిపోయే అప్‌డేట్‌ని వెల్లడించింది. ఆ కంపెనీలోని ఫేమస్‌ లైనప్‌లో ఒకటిగా డిజైర్‌ని అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో (Updated Swift Dzire) తీసుకురాబోతుంది. దీనిని నవంబర్ 11 న అధికారికంగా విడుదల చేయనున్నట్ల తెలిపింది. ఈ సెడాన్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్విఫ్ట్ 4th జనరేషన్‌తో ఫీచర్లను పంచుకోనుంది.

ఈ సెడాన్‌ని సరసమైన ధరలో మారుతి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భారీ ఫీచర్లు, మంచి మైలేజీతో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు మారుతి సుజుకి డిజైర్ సెడాన్ ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఈ సెడాన్ ముందు భాగంలో కొత్త గ్రిల్, బంపర్, మెరుగైన LED హెడ్ లైట్లు, ఫాగ్ లైట్స్‌, LED DRLs ఉంటాయి.

2024 Maruti Dzire Launching on November 11

ఇక దీని సైడ్‌ ఫ్రొఫైల్‌లో అల్లాయ్ వీల్స్, వెనుక రీడిజైన్‌తో వచ్చే LED టెయిల్‌లైట్ సెటప్‌ని కలిగి ఉంటుంది. ఇంటీరియర్‌లోనూ భారీ అప్‌గ్రేడ్స్‌ చేసే అవకాశం ఉంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (9 ఇంచెస్‌), ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, సన్‌రూఫ్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

సుజుకి డిజైర్ సెడాన్ 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 82bhp పవర్‌, 108nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ / ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి వస్తుంది. ఇది సీఎన్‌జీ పవర్‌ట్రైన్ ఆప్షన్‌తో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ వెర్షన్‌లో 32 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

2024 Maruti Dzire Launch

పెన చెప్పిన విధంగా మారుతి సుజుకి డిజైర్‌ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ .6.70 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచే ప్రారంభం ‌అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పటిలాగానే దీనిని 5-సీటర్ వెర్షన్‌లో అందించనున్నారు. ఇది ఆర్కిటిక్ వైట్, షెర్వర్డ్‌ బ్రౌన్, ఫీనిక్స్ రెడ్, బ్లూ బ్లాక్ బ్లాక్, మాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లలో కొత్త డిజైర్ కూడా లభిస్తుంది.

మొత్తం మీద మారుతి సుజుకి డిజైర్ సెడాన్ చిన్న కుటుంబాలకు సరిపోతుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో అందుబాటులో వస్తుండటంతో ఇది ఆ కంపెనీ సేల్స్‌లో మళ్లీ టాప్‌లో కొనసాగే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో లాంచ్‌ అయిన తర్వాత దేశీయ కస్టమర్ల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ఈ సెడాన్‌ హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్‌కి గట్టి పోటీని ఇస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, October 27, 2024, 19:22 [IST]
English summary
2024 maruti dzire launching on november 11 all you need to know about this updated sedan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+