అదంతా అప్పుడండీ, మేము మారిపోయాం అంటున్న మారుతి.. తొలిసారి సేఫ్టీలో 5 స్టార్‌ సాధించిన మారుతి కొత్త కారు!

ప్రస్తుతం కార్లు కొనేసమయంలో భారతీయల ఆలోచన ధోరణి మారింది. మైలేజీ, ఫీచర్లు, ధర కంటే ఎక్కువగా సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే విధంగా కొనుగోలుదారులు తమ మైండ్‌సెట్‌ని మార్చుకుంటున్నారు. మార్కెట్‌లో టాటా, మహీంద్రా కార్లు సేఫ్టీ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్స్‌తో సత్తా చాటుతున్నాయి. అయితే మారుతి సుజుకి మాత్రం ఈ స్కోర్‌ని చేరుకోలేక పోతుంది. సేఫ్టీ కారణంగా కొందరు మారుతి కారుని కొనేయడం మానేశారు. ఆల్టో నుంచి గ్రాండ్ విటారా వరకు ఇదే సీన్‌ రిపీట్‌ అవుతూ వస్తోంది. మారుతి లైనప్‌లో ఏ ఒక్క కారు కూడా ఇప్పటివరకు క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్‌ సాధించకపోవడం పెద్ద మచ్చ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రిమార్క్‌కి మారుతి చెక్‌ పెట్టింది.

ఆ కంపెనీ నుంచి నవంబర్ 11న విడుదల కానున్న మారుతి డిజైర్‌ 4th జనరేషన్‌ క్రాష్‌ టెస్ట్‌లో అదరగొట్టింది. గ్లోబల్‌ ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ సాధించింది. ఇక నుంచి సేఫ్టీలోనూ మారుతి కార్లు దుమ్మురేపుతాయని సంకేతలను ఇచ్చింది. ఇప్పుడు సేఫ్టీలో సత్తా చాటడంతో మైలేజీ, ఫీచర్లతో మారుతి కార్లు మార్కెట్‌ని మరింత విస్తరించుకునే అవకాశం ఉంది.

New Maruti Dzire 5 Star Safety

గ్లోబల్ NCAP క్రాష్‌టెస్ట్‌ రిజల్ట్స్‌ వెల్లడి అయ్యాయి. మారుతి కూడా సర్‌ప్రైజ్‌గా ఈ ఫలితాలను విడుదల చేసింది. క్రాష్‌టెస్ట్ ఫలితాల అధికారిక లాంచ్‌కి కొద్ది రోజుల ముందే ఈ అప్‌డేట్‌ని ప్రకటించింది. కొత్త మారుతి డిజైర్ పెద్దల సేఫ్టీలో 5 స్టార్‌, పిల్లల సేఫ్టీలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని సాధించింది. తద్వారా గ్లోబల్ NCAP క్రాష్‌టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి మారుతి సుజుకి కారుగా అవతరించింది.

క్రాష్‌ టెస్టింగ్‌ కోసం మారుతి స్వచ్ఛందంగా ఈ కొత్త డిజైర్‌ని క్రాష్ టెస్టింగ్ కోసం పంపినట్లు తెలిసింది. ఈ విషయంలో మారుతికి ధైర్యాన్ని ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త కాంపాక్ట్ సెడాన్ భారీ సేఫ్టీ ఫీచర్లతో వస్తుందని సీన్‌ అర్థం అయిపోయింది. మారుతి డిజైర్‌ ఇదివరకే సేఫ్టీ ఫీచర్లను ప్రకటించింది.

New Maruti Dzire 5 Star Safety Scores

కొత్త మారుతి డిజైర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అన్ని సీట్లకు రిమైండర్‌తో కూడిన 3-పాయింట్ సీట్ బెల్ట్స్‌, రియర్ అవుట్ బోర్డ్ సీట్ల కోసం ఐసోఫిక్స్ మౌంట్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీటెన్షనర్, లోడ్ లిమిటర్, పాదచారుల కోసం కూడా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త సెడాన్‌లో కొన్ని సేఫ్టీ ఫీచర్లను మారుతి సుజుకి అప్‌గ్రేడ్‌ చేసింది.

ఇక సేఫ్టీ టెస్ట్‌ రిజల్ట్స్‌ విషయానికి వస్తే ఇది పెద్దల క్రాష్‌ టెస్ట్‌లో 34 పాయింట్లకు గాను 31.24 పాయింట్లను సాధించింది. ఈ టెస్ట్‌లో డ్రైవర్, ప్రయాణికుడి తలకు, మెడ సేఫ్టీ బాగుందని నివేదిక పేర్కొంది. అయితే ఇది డ్రైవర్ ఛాతీకి స్వల్ప రక్షణను మాత్రమే ఇస్తుందని వెల్లడించింది. డ్రైవర్, ప్రయాణికుడి మోకాళ్లు కూడా అద్భుతమైన సేఫ్టీని కలిగి ఉన్నాయని తెలిపింది.

కొత్త కాంపాక్ట్ సెడాన్‌లో బాడీషెల్, ఫుట్‌వెల్‌ ఏరియా స్థిరంగా ఉన్నాయని గ్లోబల్ NCAP అంచనా వేసింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లోనూ ప్రయాణికుల తల, ఛాతీ, పొత్తికడుపు, నడుము భాగాలకు మంచి రక్షణ ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఛాతీ భాగంలో స్వల్ప సేఫ్టీ మాత్రమే ఉందని పేర్కొంది. పిల్లల సేఫ్టీ పరంగా చూస్తే డిజైర్ 42 పాయింట్లకు గాను 39.20 పాయింట్లు సాధించింది.

మొత్తం మీద మారుతి ఈ కొత్త మారుతి సెడాన్‌ అద్భుతంగా ఉందని గ్లోబల్‌ ఎన్‌సీఏపీ వెల్లడించింది. ఈ కొత్ డిజైర్‌ని LXi, VXi, ZXi, ZXi + వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతానికి దీని ధరకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఈ 2024 మారుతి డిజైర్ 1.2-లీటర్, మూడు సిలిండర్ల, Z 12 E పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 80 bhp పవర్, 112nm టార్క్‌ని విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 8, 2024, 17:13 [IST]
English summary
2024 maruti dzire secured 5 star safety rating in global ncap crash test check scores here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+