కారు కొనేవారు కాస్త ఓపిక పట్టిండి.. ఎందుకంటే 2024 స్విఫ్ట్‌ డిజైర్‌ సన్‌రూఫ్ ఫీచర్‌తో వస్తోంది..!!

2024 మారుతి సుజుకి డిజైర్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. ఈ నెలలోనే విడుదలైన 2024 మారుతి సుజుకి 4th స్విఫ్ట్‌ తర్వాత వచ్చే కారు ఇదే. ఈ కొత్త డిజైర్‌కి సంబంధించిన పలు టెస్టింగ్‌లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంటీరియర్‌, బయట డిజైన్‌లలో కొన్ని మార్పులతో పాటు కీలక అప్‌డేట్స్‌తో ఈ కారు విడుదల కానుంది.

ఈ 1.2-లీటర్ Z సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇది 82 PS వద్ద 112 Nm టార్క్‌ని విడుదల చేయనుంది. డిజైర్‌ వలె 5-స్పీడ్ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ మరియు AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉండనుంది. కొత్త డిజైర్ CNG పవర్‌ట్రెయిన్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Maruti-Dzire-Car

ఈ కొత్త మారుతి డిజైర్ 2024 ద్వితీయార్థంలో విడుదల కానుంది. దీని ప్రారంభ ధర రూ. 7 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కారు ఇది హోండా అమేజ్‌, హ్యుందాయ్‌ అరా, టాటా టిగోర్‌లతో పోటీ పడనుంది. ఈ కారు ఒక్కసారి అందుబాటులోకి వస్తే పూర్తి మార్కెట్‌ని శాసిస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ రాబోయే కారులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు మరియు ఓవల్ గ్రిల్‌లతో రానున్నాయి. దీనిలో కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ర్యాప్‌రౌండ్ LED టెయిల్ లైట్‌లను కలిగి ఉండగా.. రూఫ్‌లైన్ మరియు ఇతర అధునాతన ఫీచర్లను గమనించవచ్చు. మారుతి ఫోర్త్‌ జనరేషన్‌ సెడాన్‌ మాదిరిగానే డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇంకా మరెన్నో అధునాత ఫీచర్లను ఈ కారులో మారుతి జత చేయనుంది.

Marui-Dzire

స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, కొత్త సీట్ అప్ హోల్ స్టరీ, అప్ డేటెడ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. మారుతి స్విఫ్ట్‌లో లభించే ఫీచర్లు అన్ని ఇందులో కూడా ఉండనున్నాయి. ఇందులో సన్‌రూఫ్‌ని కూడా సంస్థ అందించనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కొత్త టచ్‌స్క్రీన్‌తో పాటు, 2024 డిజైర్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, బ్యాక్‌ వెంట్స్‌తో కూడిన ఆటో AC, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మరియు హైట్‌తో పాటు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటును గమనించవచ్చు. ఇక ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్‌), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్ మరియు బహుశా 360-డిగ్రీ కెమెరాను కూడా పొందే అవకాశం ఉంది.

2024-Maruti-Dzire

ఇటీవలె విడుదలైన 4th జనరేషన్‌ మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.56 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. అధునాతన ఫీచర్లు, పూర్తి స్మార్ట్‌ అప్‌డేట్స్‌తో వచ్చిన ఈ కారు అధిక మైలేజీని సైతం అందిచనుంది. సుజుకి స్విఫ్ట్‌ కొత్త జెడ్-సిరీస్ ఇంజిన్ AMT ట్రాన్స్మిషన్‌ లీటరుకు 25.75 కిలోమీటర్లు మరియు మాన్యువల్ గేర్ బాక్స్ తో 24.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 21, 2024, 13:00 [IST]
English summary
2024 maruti dzire will get sun roof option price and specification details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+