2024లో విడుదలైన భారీ మైలేజ్ ఇచ్చే కారు ఇదే.. దేశంలోనే అందరి ఫేవరెట్ మారుతీ సుజుకీ మోడల్..
ఇండియా మార్కెట్లో ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం మంచి వృద్ధిని కనబరిచింది. అనేక కార్ల తయారీ కంపెనీలు పలు కొత్త కొత్త మోడళ్లను విజయవంతంగా విడుదల చేశాయి. అయితే వీటిలో దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ(Maruti Suzuki) గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఏడాది అదిరిపోయే కార్లను విడుదల చేస్తుంది. వీటిలో చాలా వరకు బ్లాక్ బస్టర్‌గా నిలుస్తాయి. 2024లో కూడా అలాంటి మోడల్ ఒకటి ఉంది. అదే మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్‌జీ వేరియంట్ (Dzire CNG). ఇప్పటికి పెట్రోల్ వేరియంట్ అందుబాటులో ఉండగా, కొనసాగింపుగా ఈ కార్లలో Cng కిట్‌ను అమర్చి తీసుకొచ్చింది, ఇది బాగా సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో డిజైర్ cng వేరియంట్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. మైలేజ్ ఎక్కువ కావాలని కోరుకునే వినియోగదారులకు ఇది సరైన ఆప్షన్ అవుతుంది.
అయితే మారుతీ డిజైర్‌లో VXI, ZXI వేరియంట్‌లకు మాత్రమే CNGని అందించింది. మిగతా వేరియంట్లు ఎప్పటిలాగే ఉన్నాయి. cng ధరల విషయానికి వస్తే, VXi వేరియంట్ ధర రూ. 8.74 లక్షలు (ఎక్స్-షోరూమ్), ZXi ధర రూ. 9.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. cng వెర్షన్లు, 1.2-లీటర్, 3-సిలిండర్, Z సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఇంజిన్ 69 bhp పవర్‌ను, 101 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Dzire CNG గేర్‌బాక్స్ విషయానికి వస్తే, ఇవి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే పెట్రోల్ వేరియంట్ మాత్రం 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ (AMT) రెండు గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభిస్తుంది. దీని ఇంజిన్ 80 bhp పవర్, 112 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ ఎంచుకునే కస్టమర్లకు cng వేరియంట్ సెట్ కాదు.
మైలేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే,డిజైర్ పెట్రోల్ వెర్షన్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 25 కి.మీల వరకు ఇస్తుంది అదే CNG వేరియంట్ మాత్రం కిలో సీఎన్‌జీకి ఏకంగా 33.73 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. భారత్‌లో మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. కాబట్టి బడ్జెట్ ధరలో పెట్టిన ప్రతి రూపాయికి లాభం చేకూర్చే కారును కొనుగోలే చేయాలనుకును వారికి డిజైర్ సీఎన్‌జీ బెస్ట్ ఆప్షన్.

ప్రయాణికుల భద్రత పరంగా కూడా డిజైర్ సీఎన్‌జీ అత్యుత్తమైన ఆప్షన్. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇది 5-స్టార్ రేటింగ్ సాధించిన మొదటి మారుతీ సుజుకి మొదటి కారుగా ఘనతను సాధించింది. ఇండియా మార్కెట్లో డిజైర్ అంటే ఎప్పటికి ఒక సంచలన మోడల్‌గానే ఉంటుంది. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న కారు ఇదే. ఈ కారులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS సిస్టం, హిల్ హోల్డ్ అసిస్ట్, అన్ని సీట్లకు మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అలాగే, లోపల ప్రీమియం ఫీచర్లు కూడా బాగానే ఉంటాయి. వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రయిడ్ ఆటో, 9 అంగుళాల స్మార్ట్ ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, AC వెంట్స్, ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.

రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్,క్రూయిజ్ కంట్రోల్, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా,వెనుక డీఫాగర్ వంటి వాటిని డిజైర్ కలిగి ఉంది. మారుతీ సుజుకీ డిజైర్‌కు ఇండియా మార్కెట్లో హోండా కొత్త తరం అమేజ్ గట్టి పోటీ ఇస్తుంది. ఈ కారును కంపెనీ ఇటీవల విడుదల చేసింది. అమేజ్ సెడాన్ ప్రారంభ ధర రూ.8 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications








