33.73 కి.మీల మైలేజ్ ఇచ్చే భారీ డిమాండ్ ఉన్న మారుతీ కొత్త కారు ఇదే.. కొద్ది రోజుల్లో మీ వద్దకు రాబోతుంది..
భారత వాహన పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ ఇండియా(Maruti Suzuki India) బడ్జెట్ ధరలో అధిక మైలేజ్ ఇచ్చే వాహనాలను విడుదల చేస్తూ కారును కలిగి ఉండాలనే ప్రజల కోరికను తీరుస్తుంది. మిడిల్ క్లాస్ వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని మారుతీ కంపెనీ ప్రతి ఏడాది కూడా అధునాతన ఫీచర్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తుంది. మారుతీ నుంచి 25 ఏళ్ల క్రితం విడుదల అయిన వ్యాగన్ ఆర్(Wagon R) కారును ఇప్పటికి కూడా చాలా మంది ఇష్టం కొనుగోలు చేస్తున్నారు. ఇన్నేళ్ల నుంచి కూడా మారుతీకి చెందిన ఒక మోడల్ అత్యంత డిమాండ్ ఉన్న కారుగా ఉండటం అంటే దేశీయ ప్రజల్లో ఈ కంపెనీకి ఇండియాలో ఎంత నమ్మకమైన సంస్థగా పేరు ఉందో అర్ధం అవుతుంది. నమ్మకమైన మైలేజ్, తక్కువ ధరలో కార్లను అందించే కంపెనీగా మారుతీ సుజుకీకి ఒక గుర్తింపు ఉంది.
ఇంతటి గొప్ప గుర్తింపు కలిగిన మారుతీ సుజుకీ నుంచి వచ్చిన డిజైర్(Dzire) కారు కూడా ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న వాహనంగా నిలిచింది. ఇది ఒక సెడాన్ మోడల్. ఈ మోడల్‌కు భారతీయ ప్రజల్లో ఆదరణను గుర్తించిన కంపెనీ అప్‌డేట్ ఫీచర్లతో కాలానికి అనుగుణంగా డిజైర్‌కు కొనసాగింపుగా కొత్త వెర్షన్లను విడుదల చేస్తూనే ఉంది. కంపెనీ కొత్త 4వ తరం డిజైర్ సెడాన్‌ను మార్కెట్లోకి నవంబర్‌లో విడుదల చేసింది.

మారుతీ సుజుకీ 4వ తరం డిజైర్ సెడాన్ ధర రూ.6.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది లాంచ్ అయిన వెంటనే దేశవ్యాప్తంగా దాదాపు 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్‌ను సాధించింది. మొదటగా డీలర్‌షిప్‌లకు పెట్రోల్‌తో నడిచే డిజైర్‌ను సరఫరా చేశారు. ఆ తర్వాత బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు అతి వేగంగానే డెలివరీ చేశారు. దీని తర్వాత ఇప్పుడు CNG వేరియంట్లను కూడా వేగంగా సరఫరా చేయడం మొదలుపెట్టారు.
కొద్ది రోజుల నుంచి మారుతీ సుజుకీ దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లకు మారుతి సుజుకి డిజైర్ సీఎన్‌జీ మోడల్ డెలివరీని ప్రారంభించింది. డిజైర్ సెడాన్ VXi, ZXi వేరియంట్‌లలో మాత్రమే CNG ఆప్షన్ ఉంది. దీని ప్రారంభ ధర రూ.8.74 లక్షలుగా ఉంది. పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే మరింత ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. CNGలో డిజైర్ భారీ మైలేజ్ ఇస్తుంది. కిలోకు 33.73 కిమీ మైలేజ్ వస్తుంది.

మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్‌జీ మోడల్ 1.2-లీటర్ జడ్ సిరీస్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 70 PS హార్స్ పవర్, 102 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఇచ్చారు. అదే డిజైర్ పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే, 1.2-లీటర్ 3-సిలిండర్ జడ్ సిరీస్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 82 PS హార్స్ పవర్, 112 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సెటప్‌ను జత చేశారు. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 24.79 నుండి 25.71 కి.మీల మైలేజ్ ఇస్తుంది. అదే సీఎన్‌జీలో అయితే ఏకంగా 33.73 కిమీ వరకు వస్తుంది. ఎక్స్‌టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, పెట్రోల్, CNG మోడల్‌లు రెండూ ఒకే విధంగా ఉంటాయి. LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు , డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఒకే విధంగా ఉంటాయి.
మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్‌జీ, పెట్రోల్ మోడల్స్ 5 సీట్లను కలిగి ఉన్నాయి. ఇవి మాగ్మా గ్రే, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ వంటి పలు కలర్ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. రెండు మోడళ్లలో కూడా ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి మరిన్ని ఉన్నాయి.


Click it and Unblock the Notifications








