నిజమైన ఫ్యామిలీ కారు అంటే ఇదే సోదరా.. 33 కి.మీ భారీ మైలేజీ, టాక్సీ డ్రైవర్లు కళ్లుమూసుకుని కొంటారు!

2024 మారుతి సుజుకి డిజైర్ (2024 Maruti Suzuki Dzire) కోసం భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ కారుకి సంబంధించిన అప్‌డేట్స్‌ని రోజువారిగా రివీల్‌ చేస్తూ మారుతి సుజుకి ఆసక్తిని పెంచుతోంది. ఈ కారు అధికారికంగా నవంబర్‌ 11న మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ కాంపాక్ట్ సెడాన్‌కి సంబంధించిన బుకింగ్స్‌ కూడా ఆరంభం అయ్యాయి. ఇదివరకే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న డిజైర్‌కి భారీ డిమాండ్‌ ఉంది. ఈ మార్కెట్‌ని ఒడిసిపట్టుకునేందుకు మారుతి దీనిని తీసుకువస్తోంది. ప్రస్తుతం ఉన్న సెడాన్లతో పోల్చితే మారుతి డిజైర్ ఒక ఫర్‌ఫెక్ట్‌ ఫ్యామిలీ కారు అని చెప్పవచ్చు.

మారుతి డిజైర్‌లోని సొగసైన డిజైన్, ప్రీమియం ఫీచర్లు, ఇంటీరియర్‌లో తగినంత స్పేస్‌ వంటివి దీనిని టాప్‌లో నిలబెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. విడుదలకు ముందే మారుతి డిజైర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి అయ్యాయి. ఈ సెడాన్‌ని LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఇది భారీ డిజైన్‌లో క్రేజీ లుక్‌తో దర్శనమివ్వనుంది.

2024 Maruti Suzuki Dzire Sedan Variants

నాలుగు మీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఈ సెడాన్ 3,995 mm పొడవు, 1,735 mm వెడల్పు, 1,525 mm ఎత్తు, 2,450 mm వీల్‌బేస్‌తో వస్తుంది. ఇక దీని మొత్తం బరువు 1,375 కిలోలుగా ఉంది. ఇందులోని అన్ని వేరియంట్లలో ఐడల్ స్టార్ట్-స్టాప్ (ISS) సిస్టమ్‌ని కలిగి ఉంటుంది. ఇది మైలేజీని పెంచడానికి సహాయపడుతుంది.

ఈ 3rd జనరేషన్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ని కలిగి ఉంటుంది. ముందుగా చెప్పిన విధంగా దీని డిజైన్‌ని చూస్తే ఈ సెడాన్ లగ్జరీ కార్లతో సమానంగా ఉంటుంది. దీంతో పాటు కొత్త LED హెడ్‌ల్యాంప్స్, హారిజాంటల్ స్లాట్స్‌తో కూడిన పాలిష్డ్ గ్రిల్, న్యూ అల్లాయ్ వీల్స్, సరికొత్త LED టెయిల్‌లైట్స్‌, ఆటోమేటిక్ క్రూయిజ్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

2024 Maruti Dzire Features

2024 మారుతి డిజైర్ 1.2-లీటర్, 3 సిలిండర్స్‌ Z 12E పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 80 bhp పవర్, 112nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. ఫ్యామిలీతో పాటు ట్యాక్సీ ఆపరేటర్లను కూడా దృష్టిలో ఉంచుకుని కాంపాక్ట్ సెడాన్‌ని సీఎన్‌జీ వేరియంట్‌ లోనూ తీసుకురానున్నారు.

దీనిని మునుపటి K-సిరీస్ 4-సిలిండర్ ఇంజిన్‌తో పోలిస్తే టార్క్‌ పవర్స్‌ తక్కువగా ఉన్నప్పటికీ.. డిజైర్లోని కొత్త పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌ లీటరుకు 22.41 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. సీఎన్‌జీ మోడళ్లు కిలోకు 32 కిలోమీటర్ల కంటే ఎక్కువగానే మైలేజీ ఇచ్చే అవకాశం ఉంది. మంచి మైలేజీ కోసం కారుని చూస్తున్నట్లైతే మీరు దీనిని కళ్లుమూసుకుని కొనుగోలు చేయవచ్చు.

2024 Maruti Suzuki Dzire Launch

ఇక ఈ కొత్త డిజైర్‌ స్విఫ్ట్ మాదిరిగానే అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌ 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో రానుంది. దీనితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్‌, వైడ్ యాంగిల్ రియర్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు అధునాతనంగా కనిపించనుంది. ఈ మారుతి కొత్త కారు ధర సుమారు రూ .7.50 లక్షలు మాత్రమే ఉండే అవకాశం ఉంది.

ఈ కాంపాక్ట్ సెడాన్ మార్కెట్‌లో హోండా అమేజ్, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా వంటి వాటికి గట్టి పోటీని ఇవ్వనుంది. మంచి ప్రయాణ సౌకర్యం, పెద్ద డిక్కీ స్పేస్, మైలేజీ కోరుకునే వారిని కొత్త డిజైర్ ఆకట్టుకోగలదు. ఈ కారు విడుదల తర్వాత ఎక్కువ క్రేజ్‌ని సాధించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దీనిని భారీ సంఖ్యలో బుక్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 7, 2024, 13:10 [IST]
English summary
2024 maruti suzuki dzire sedan variants and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+