స్విఫ్ట్‌ కారుతో మాములుగా ఉండదు.. 40,000 లకు పైగా బుకింగ్స్‌.. జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్న కొత్త కారు

మారుతి సుజుకి స్విఫ్ట్ 4th జనరేషన్‌ని మే 9 న అధికారికంగా ఆ సంస్థ మార్కెట్‌లోకి తీసుకుచ్చింది. ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. బుకింగ్స్‌ ప్రారంభమైనప్పటీ నుంచి ఈ కారును అధిక సంఖ్యంలో బుకింగ్స్‌ని అందుకుంది. ఇప్పటికే ఈ కారుకి సంబంధించిన డెలివరీలు కూడా ప్రారంభం అయ్యాయి. దేశంలోని వివిధ షోరూమ్‌లలో ఈ కారుని సంస్థ డెలివరీలు చేస్తుంది. ప్రస్తుతం భారీ సంఖ్యలో జనాలు ఈ కారుకు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ కారుకి సంబంధించిన బుకింగ్స్‌, ఆ కారులో గల ఫీచర్లు, ఫర్ఫామెన్స్‌ ఇతర వివరాలు మీ కోసం..

మారుతి సుజుకి మే 9 న నాల్గవ తరం స్విఫ్ట్‌ను అధికారికంగా విడుదల చేసింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కారుగా ఉంది. ఈ కారు లాంచ్ కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కారు లాంచ్‌, డెలివరీలకు సంబంధించి జనాలు ఎక్కువగా వెతుకుతున్నారు. అందుకే నిత్యం ఈ కారు వార్తల్లో నిలుస్తుంది.

2024-Maruti-Suzuki-Swift-Bookings

నెలకు 40,000 మంది ఈ కారును బుక్ చేసుకున్నట్లు మారుతి అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే కారు డెలివరీ ప్రారంభమైంది. ఇప్పటికే డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యతా క్రమంలో కారు డెలివరీ జరుగుతోంది. మారుతి సుజుకి ఇండియా మే 2024లో 1.44 లక్షల సేల్స్‌తో టాప్‌లో నిలిచింది. ఇందులో 19,393 స్విఫ్ట్‌ యూనిట్లను మారుతి విక్రయించింది. దీంతో మే నెలలో కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

ఇప్పటికే బాగా అమ్ముడవుతున్న డిజైర్, వ్యాగన్ ఆర్ వంటి మోడళ్లను ఈ కారు బీట్ చేసింది. నాలుగో తరం మారుతి స్విఫ్ట్ కు ఊహించిన దానికంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి. ఈ కారు యొక్క సీఎన్‌జీ వేరియంట్ ఇంకా లాంచ్ కాలేదు. కారు యొక్క సిఎన్జి వేరియంట్ ప్రవేశపెట్టిన తర్వాత మరిన్ని బుకింగ్లు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. సిఎన్జి వేరియంట్ వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

2024-Maruti-Suzuki-Swift

మారుతి సుజుకి స్విఫ్ట్ మాన్యువల్ గేర్ వేరియంట్ కోసం 83 శాతం బుకింగ్‌లను అందుకుంది. కేవలం 17 శాతం బుకింగ్స్ మాత్రమే AMT వేరియంట్‌కి వచ్చాయి. అంతేకాదు, మీడియం వేరియంట్ VXI వేరియంట్ కోసం ఇప్పటివరకు 50 శాతం వరకు బుకింగ్స్ వచ్చాయని మారుతి వెల్లడించింది. త్వరలోనే ఈ బుకింగ్స్‌ శాతం పెరుగుతాయని సంస్థ భావిస్తోంది. డిమాండ్‌కి తగినట్లుగా ఉత్పత్తి చేస్తామని సంస్థ వెల్లడించింది.

కొత్త తరం మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ .6.49 లక్షలు. దీని ధర రూ.9.64 లక్షలుగా ఉంది. తాజాగా మారుతి తన AMT ధరలను రూ.5,000 వరకు తగ్గించింది. కొత్త తరం స్విఫ్ట్‌ ధరలను కూడా త్వరలోనే తగ్గించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ కొత్తగా అభివృద్ధి చేసిన 1.2-లీటర్ మూడు సిలిండర్ల జెడ్ సిరీస్ ఇంజిన్ తో పనిచేస్తుంది.

ఈ కారు ఇంజిన్‌ 80bhp పవర్ మరియు 112nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మునుపటి ఇంజిన్ కంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వగలదు. ప్రస్తుతం ఈ కారు లీటరుకు 25.72 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని సంస్థ తెలిపింది. ఈ కారు ఎక్కువ దీని మైలేజీ అందించడం సేల్స్‌కి ప్రధాన కారణమని చెప్పవచ్చు. దీనివల్ల మారుతి స్విఫ్ట్‌ ఇప్పటికీ టాప్‌లో ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 4, 2024, 11:40 [IST]
English summary
2024 maruti suzuki swift bookings crossed over 40000
Read more on: #maruti suzuki #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+