టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ తగ్గింపు.. డిస్కౌంట్ అంటే ఇలా ఉండాలి!

దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' 2024 మే నెలలో ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందులో టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ ఉన్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

టాటా మోటార్స్ ఇప్పుడు నెక్సాన్ మరియు టియాగో ఎలక్ట్రిక్ కార్ల మీద అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బెనిఫీట్స్, కార్పొరేట్ ఆఫర్స్ మరియు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేవారి ప్రోత్సాహకం కోసం 'గ్రీన్ బోనస్' కూడా అందిస్తోంది. కంపెనీ అందించే ఈ డిస్కౌంట్స్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ఈ విషయం గమనించాలి.

Tata Nexon EV

టాటా నెక్సాన్ ఈవీ

టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఈవీ అన్ని వేరియంట్ల మీద రూ. 75000 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు (ఈ ప్రయోజనాలు 2023 మోడల్ కొనుగోలుకు మాత్రమే వర్తిస్తాయి). ఇందులో రూ. 50000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5000 వరకు కార్పొరేట్ తగ్గింపులు ఉన్నాయి. ఇక నెక్సాన్ ఈవీ 2024 మోడల్ కొనుగోలు మీద రూ. 55000 తగ్గింపు లభిస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ ఎంఆర్ 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 325 కిమీ రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. అదే సమయంలో నెక్సాన్ ఈవీ ఎల్ఆర్ 40.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 465 కిమీ రేంజ్ అందిస్తుంది. నెక్సాన్ ఈవీ ధరలు 14.49 లక్షల నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది.

Tata Tiago EV

టాటా టియాగో ఈవీ

టియాగో ఈవీ (Tiago EV) యొక్క 2023 మోడల్ కొనుగోలు మీద టాటా మోటార్స్ (Tata Motors) ఇప్పుడు ఏకంగా రూ. 72000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇది 2023 టాటా టియాగో యొక్క అన్ని వేరియంట్లకు చెల్లుబాటు అవుతుంది. ఇందులో రూ. 50000 గ్రీన్ బోనస్, రూ. 15000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 7000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.

2024 టాటా టియాగో ఈవీ లాంగ్ రేంజ్ కొనుగోలుపైన కంపెనీ రూ.52000 విలువైన ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంది. కాగా మిడ్ రేంజ్ టాటా టియాగో ఈవీ కొనుగోలు మీద రూ.37000 విలువైన ప్రయోజనాలను మాత్రమే పొందవచ్చు. టాటా టియాగో ఈవీ ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.39 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇవి సిట్రోయెన్ ఈసీ3 మరియు ఎంజీ కామెట్ ఈవీ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా టియాగో ఈవీ మిడ్ రేంజ్ 19.2 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులో 61 హార్స్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ మోటారును శక్తినిస్తుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 250 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ మోడల్ 24 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 315 కిమీ రేంజ్ అందిస్తుంది.

గమనిక: టాటా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లభిస్తాయి. కాబట్టి టాటా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఖచ్చితమైన తగ్గింపులు గురించి తెలుసుకోవడానికి సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించండి. ఈ డిస్కౌంట్స్ మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 8, 2024, 12:26 [IST]
English summary
2024 may discounts on tata nexon ev and tiago ev
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+