ఫోక్స్‌వ్యాగన్ కార్ల కొనుగోలుపై భారీ తగ్గింపు.. ఇవి కదా డిస్కౌంట్స్ అంటే!

భారతీయ మార్కెట్లో ఇప్పటికీ టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి కంపెనీ తమ ఉత్పత్తుల మీద డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఈ తరుణంలో ఫోక్స్‌వ్యాగన్ కూడా ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ఇప్పుడు తన బ్రాండ్ కార్లయిన వర్టస్, టైగన్ మరియు టిగువాన్ మీద భారీ తగ్గింపులు ప్రకటించింది. అయితే ఈ డిస్కౌంట్స్ కేవలం ఈ నెల చివరి వరకు (మే 31) మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ అందించే డిస్కౌంట్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ బెనిఫీట్స్ మొదలైనవి ఉన్నాయి.

Volkswagen Virtus

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్

ఫోక్స్‌వ్యాగన్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ వర్టస్ కొనుగోలు మీద ఈ నెలలో ఏకంగా రూ. 1.40 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ 2023 మోడల్ కొనుగోలుకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో రూ. 90000 క్యాష్ డిస్కౌంట్, రూ. 30000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 20000 కార్పొరేట్ బెనిఫీట్స్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరి లోపల కొనుగోలు చేసిన కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది.

2024 ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మోడల్ కొనుగోలు మీద కస్టమర్లు రూ.30000 డిస్కౌంట్ మాత్రమే పొందగలరు. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన వర్టస్ సెడాన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (115 హార్స్ పవర్) ఇంజిన్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (150 హార్స్ పవర్) ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ మరియు మారుతి సియాజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Volkswagen Tiguan

ఫోక్స్‌వ్యాగన్ టైగన్

టైగన్ కొనుగోలుపైన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ రూ. 1.15 లక్షల డిస్కౌంట్ (2023 మోడల్ కొనుగోలుపై) అందిస్తోంది. ఇందులో రూ. 65000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 30000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ మరియు రూ. 20000 వరకు కార్పొరేట్ బెనిఫీట్స్ లభిస్తాయి. 2024 మోడల్ కొనుగోలుపై డిస్కౌంట్ కొంత తక్కువగా ఉంటుంది. టైగన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ యొక్క 2023 మోడల్ కొనుగోలుపైన కస్టమర్లు రూ. 1.50 లక్షల డిస్కౌంట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 75000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 75000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ వంటి వాటితో పాటు నాలుగు సంవత్సరాల సర్వీస్ ప్యాకేజ్ ఉచితంగా పొందవచ్చు. 2024 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ కొనుగోలుపైన కస్టమర్లు రూ. 50000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మాత్రమే లభిస్తుంది.

Volkswagen Taigun

మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగిన ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ కొనుగోలుపైన కస్టమర్లు ఈ నెలలో మంచి తగ్గింపులను పొందవచ్చు. ఈ కారు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇది పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

గమనిక: ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లభిస్తాయి. కాబట్టి ఫోక్స్‌వ్యాగన్ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఖచ్చితమైన తగ్గింపులు గురించి తెలుసుకోవడానికి సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించండి. ఈ డిస్కౌంట్స్ మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Saturday, May 11, 2024, 10:08 [IST]
English summary
2024 may discounts on volkswagen cars from virtus to tiguan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+