2024 Nissan X-Trail Full Review Video నిస్సాన్ సరికొత్త ఎస్‌యూవీ ఎలా ఉంది?
2024 నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఒక దశాబ్ద కాలం సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత్‌లో అడుగుపెట్టింది. తాజాగా తీసుకువచ్చిన 4th జనరేషన్ SUVని ఇటీవల న్యూ ఢిల్లీలో మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్‌డ్రైవ్ చేసింది. ఇప్పటి వరకు వచ్చిన ఎక్స్‌ట్రైల్స్ కంటే ఇందులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ 2024 నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఒకే డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్‌ని కలిగి ఉంది. ఇందులో 1.5-లీటర్ వేరియబుల్ జామెట్రీ టర్బో, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ కలదు. ఈ ఇంజిన్ 4,800 rpm వద్ద 161bhp మరియు 2,800 మరియు 3,600rpm మధ్య 300Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
దీని ఇంజిన్ 12V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని మొత్తం శక్తిని ఎక్స్-ట్రైల్ ముందు చక్రాలకు CVT ద్వారా పంపుతుంది. ఇదొక ఫాస్ట్ రన్నింగ్ ఎస్‌యూవీగా ఉంది. ఈ నిస్సాన్ X-ట్రైల్ కేవలం 9.6 సెకన్లలో 0-100km/h వేగంతో దూసుకుపోతుంది. ఇది గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక ఒక లీటర్‌కి 13.7 కి.మీ మైలేజీ అందిస్తుందని క్లెయిమ్ చేయబడింది.
కొత్త నిస్సాన్ X-ట్రైల్ 4,680mm పొడవు, 1,840mm వెడల్పు మరియు 1,725mm ఎత్తు మరియు 2,705mm వీల్‌బేస్‌ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా 2024 X-ట్రైల్ 210mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. ఇక ఇందులో 585-లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. మీరు మూడవ, రెండవ వరుస సీట్లను మడతపెట్టడం వల్ల స్టోరేజ్ స్పేస్‌ని 1,484 లీటర్లకు పెంచుకోవచ్చు.
ఈ నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ని దాదాపు ఒక దశాబ్దం తర్వాత తీసుకువస్తుంది. ఈ ఎస్‌యూవీ విభాగంలో కింగ్‌మేకర్‌గా ఎదగాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఒక భారీ SUVగా ఉంది. ఇది నగరంలో మరియు సుదూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. పెద్ద ఫ్యామిలీలు మంచి SUV కోసం చూస్తున్నట్లైతే వారికి ఇది సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications








