లాంచ్‌కు సిద్దమవుతున్న నిస్సాన్ కొత్త కారు ఇదే!.. అప్డేట్ వివరాలు

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన నిస్సాన్ ఇండియా ప్రస్తుతం కేవలం మాగ్నైట్ కారును మాత్రమే విక్రయిస్తోంది. కాగా కంపెనీ మరో కారును దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనిపేరు ఎక్స్-ట్రైల్ (X-Trail). ఈ కారు ఈ నెల 17 నుంచి 21 మధ్య మీడియా డ్రైవ్‌లు షెడ్యూల్ చేయబడ్డాయి. అయితే నిస్సాన్ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త ఎక్స్-ట్రైల్ కారు ఎలాంటి డిజైన్ కలిగి ఉంది. ఫీచర్స్ ఏంటి? ధర ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

నిస్సాన్ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త ఎక్స్-ట్రైల్ ప్రీమియం SUV దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది సీబీయూ మార్గం ద్వారా దిగుమతి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర దాని ప్రత్యర్థుల కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది.

2024 Nissan X Trail SUV Teased

ఇటీవల వెల్లడైన కొన్ని వీడియోల ప్రకారం నిస్సాన్ ఎక్స్-ట్రైల్ అల్లాయ్ వీల్స్, పెద్ద ఫ్రంట్ గ్రిల్, లేటెస్ట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్) మరియు ఎల్ఈడీ ర్యాప్‌రౌండ్ ల్యాంప్స్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి నిస్సాన్ కంపెనీ యొక్క ఎక్స్-ట్రైల్ 2022లో భారతదేశంలో ఫస్ట్ టైమ్ టెస్ట్ చేయబడింది. కాగా ఇప్పటికి కూడా టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.

రాబోయే నిస్సాన్ ఎక్స్-ట్రైల్ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడుతుందని మరియు మిత్సుబిషి అవుట్‌ల్యాండర్‌తో భాగస్వామ్యం చేయబడిన సీఎమ్ఎఫ్-సీ ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారు ప్రపంచ మార్కెట్లో సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో సహా మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. కానీ కంపెనీ అన్ని వేరియంట్లలో భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

2024 Nissan X Trail SUV Teased

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ యొక్క లోపలి భాగంలో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే వంటి హై-ఎండ్ టెక్నాలజీలను కలిగి ఉంటుందని అంచనా. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఈ కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ప్రీమియం SUVలో 10.8 ఇంచెస్ హెడ్స్ అప్ డిస్‌ప్లే, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) కూడా పొందుతుందని సమాచారం. అంతే కాకుండా నిస్సాన్ ప్రొపైలట్ సూట్, బోస్ సౌండ్ సిస్టమ్, లెదర్ సీట్ అప్హోల్స్టరీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ప్రీమియం సర్ఫేస్ ట్రిమ్‌లు మరియు ఫినిషింగ్‌లు వంటి మరెన్నో ఇతర ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

ఇంజిన్ విషయానికి వస్తే భారత మార్కెట్ కోసం లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్న నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుందని తెలుస్తోంది. ఇది 204 హార్స్ పవర్ మరియు, 305 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అయితే ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో ఉన్న ఈ మోడల్ 2.4-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి FWD మరియు AWD అనే రెండు ఆప్షన్స్ పొందుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 4, 2024, 11:00 [IST]
English summary
2024 nissan x trail suv launch in india soon latest teaser
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+