మిడ్‌సైజ్‌ సెడాన్లపై మోజు పడుతున్న జనాలు.. టాప్‌ ప్లేస్‌లో ఏ కారు ఉందంటే?

ప్రస్తుతం మిడ్ సైజ్ ఎస్‌యూవీల వినియోగం ఎక్కువగా పెరుగుతుంది. వాటి ఇంటీరియర్ ఫీచర్లు, డిజైన్ కారణంగా చాలా మంది ఈ కార్లనే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ తయారీ కంపెనీలు సైతం వీటిపైనే ఎక్కువగా దృ‌ష్టి పెట్టి అధిక సంఖ్యలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల అక్టోబర్‌లో పండుగ సమయంలో కూడా చాలా మంది వినియోగదారులు మిడ్‌ సైజ్ ఎస్‌యూవీలపైనే ఆసక్తి చూపించారు. మిగతా విభాగాలు కూడా మెరుగైన అమ్మకాలను నమోదు చేసినప్పటికీ టాప్ కంపెనీలు అయిన హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో వంటి మిడ్-సైజ్ SUVలు మంచి గణంకాలు సాధించాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2024 లో విక్రయించబడిన టాప్ 10 మోడళ్ల వివరాలు క్రింది కథనంలో చూద్దాం..

డేటా ప్రకారం చూసినట్లయితే అక్టోబర్ నెలలో మిడ్-సైజ్ SUV విభాగంలో ఎక్కువగా అమ్ముడుపోయిన జాబితాలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా మొదటి స్థానంలో ఉంది. దీని ఆకట్టుకునే డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లతో చాలా మందిని ఆకర్షించి ఈ పండుగ టైంలో రికార్డు స్థాయిలో ఈ విభాగంలో ఎక్కువ అమ్మకాలను సాధించి టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

2024 October Mid Size Suv Sales

అక్టోబర్‌లో హ్యుందాయ్ క్రెటా మొత్తం అమ్మకాలు 17,497 యూనిట్లుగా ఉంది. ఇది గత ఏడాది(2023) ఇదే నెలలో విక్రయించిన 13,077 యూనిట్లతో పోలిస్తే, అమ్మకాలు 34 శాతం గణనీయంగా పెరిగాయి. ఇతర కంపెనీల మిడ్-సైజ్ SUVల కంటే కూడా హ్యుందాయ్ క్రెటాను దసరా, దీపావళి పండుగ సమయంలో ఎక్కువ మంది తమ ఇంటికి తీసుకెళ్లారు.

క్రెటా తరువాత అధిక సంఖ్యలో అమ్మకాలను నమోదు చేసిన మోడల్‌గా మహీంద్రా స్కార్పియో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం మహీంద్రా మిడ్ సైజ్ ఎస్‌యూవీలలో రెండు వేరియంట్లను కలిగి ఉంది. స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ రెండు కూడా పండుగ సమయంలో ఎక్కువగా అమ్ముడుపోయాయి.

డేటా ప్రకారం, ఈ రెండు మోడళ్ల విక్రయాలు అక్టోబర్‌ నెలలో 15,677 యూనిట్లుగా ఉన్నాయి. అదే గత ఏడాది(2023) ఇదే నెలలో మహీంద్రా 13,578 స్కార్పియోలను విక్రయించగా, ఈ సారి మిడ్‌ సైజ్ SUV లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు మరింత పెరిగాయి.

దీని తర్వాత మూడో స్థానంలో మరో దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీకి చెందిన గ్రాండ్ విటారా అక్టోబర్ నెలలో 14,083 యూనిట్ల అమ్మకాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఇంతకుముందు ఏడాది అక్టోబర్ నెలలో ఇది 10,834 యూనిట్లగా నమోదైంది. పండుగ సమయంలో కంపెనీ ఇచ్చిన ఆఫర్లు, డిస్కౌంట్ల కారణంగా గ్రాండ్ విటారా అమ్మకాలు పుంజుకున్నాయి.

వీటి తరువాత టాప్ 4 ఎస్‌యూవీ అమ్మకాల్లో మహీంద్రా కంపెనీకి చెందిన XUV700 అక్టోబర్‌లో 10,435 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఇవి గత ఏడాది అక్టోబర్‌లో విక్రయించిన 9,297 యూనిట్లతో పోలిస్తే 12 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే, ఐదో స్థానంలో దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ సెల్టోస్ మోడల్ ఉంది.

కియా సెల్టోస్ అక్టోబర్ నెలలో 6,365 యూనిట్ల విక్రయాలతో ఐదవ స్థానంలో ఉంది. అక్టోబర్ 2023లో విక్రయించిన 12,000 యూనిట్లతో పోలిస్తే, 49 శాతం తగ్గింది. దీని తరువాత, టయోటా హైరైడర్ అక్టోబర్‌లో 5,449 యూనిట్లను, టాటా కర్వ్ 5,351 అమ్మకాలను నమోదు చేసి, వరుసగా ఆరు, ఏడో స్థానాల్లో నిలిచాయి. కర్వ్ మోడల్ మిడ్-సైజ్ SUVలో కొత్తగా వచ్చినప్పటికి ఎక్కువ అమ్మకాలను సాధించింది.

వీటి తరువాత, స్కోడా కుషాక్ 2,213 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదో స్థానంలో ఉండగా, 2,204 యూనిట్లతో హ్యుందాయ్ అల్కాజార్ తొమ్మిది, 2,086 యూనిట్లతో టాటా సఫారీ మొదటి టాప్ 10 స్థానాల్లో నిలిచాయి. ఈ కంపెనీలతో పాటు మిగిలిన కంపెనీలకు చెందిన మిడ్-సైజ్ SUVల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Monday, November 11, 2024, 17:38 [IST]
English summary
2024 october mid size suv sales hyundai creta is huge demand check all details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+